అమెరికన్ కంపెనీ లేఆఫ్స్: 15వేల మంది బయటకు! | American Telecommunications Company Verizon To Cut 15000 Jobs | Sakshi
Sakshi News home page

అమెరికన్ కంపెనీ లేఆఫ్స్: 15వేల మంది బయటకు!

Nov 14 2025 4:12 PM | Updated on Nov 14 2025 4:41 PM

American Telecommunications Company Verizon To Cut 15000 Jobs

ఏడాది (2025) ముగుస్తున్నా.. ఉద్యోగులలో లేఆఫ్స్ భయం మాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం దిగ్గజ కంపెనీలు ముందస్తు హెచ్చరికలు లేకుండానే.. ఉద్యోగులను జాబ్స్ నుంచి తొలగించడమే. ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ అమెరికన్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ వెరిజోన్ చేరింది. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 15 శాతం మందిని తొలగించడానికి సిద్దమవుర్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వెరిజోన్ కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా.. సంస్థ సీఈఓ డాన్ షుల్మాన్ ఆధ్వర్యంలో వేలాది ఉద్యోగాలను తగ్గించనున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ ప్రభావం 15000 నుంచి 20000 ఉద్యోగులపై పడుతుంది. కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడం బహుశా ఇదే మొదటిసారి. వెరిజోన్‌లో 2024 చివరి నాటికి దాదాపు 1,00,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

వెరిజోన్ సంస్థ న్యూజెర్సీ, టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ ప్రాంతాల్లో ఎక్కువమంది ఉద్యోగులను కలిగి ఉంది. కంపెనీ ఉద్యోగుల తొలగింపును చేపట్టిన తరువాత.. ఈ ప్రభావం చిన్న చిన్న కార్యాలయాలపై పడే అవకాశం ఉంది. దీంతో అవి మూతపడే అవకాశం కూడా ఉంది. కాగా కంపెనీ యాజమాన్యంలోని 200 స్టోర్లను ఫ్రాంచైజీలుగా మార్చాలని యోచిస్తోందని సమాచారం.

ఇదీ చదవండి: నెలకు రూ.7.5 లక్షల జీతం.. మూడునెలల్లో వదిలేసాడు!

ఉద్యోగుల తొలగింపునకు ప్రధాన కారణం
వెరిజోన్ వరుసగా రెండు త్రైమాసికాల నుంచి సబ్‌స్క్రైబర్ల క్షీణతను ఎదుర్కుంటోంది. అంతే కాకుండా ఇది దాని ప్రత్యర్థుల కంటే కూడా వెనుకబడి ఉంది. ఇదే సమయంలో డాన్ షుల్మాన్ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందిస్తూ.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తామని, మా వాటాదారులకు స్థిరమైన రాబడిని అందించడానికి కృషి చేస్తామని ఆయన (డాన్ షుల్మాన్) పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement