ఆఫ్‌లైన్‌లో చెల్లింపులకు పేటీఎం టోల్‌ఫ్రీ నంబర్ | toll free number in paytm Payments Offline | Sakshi
Sakshi News home page

ఆఫ్‌లైన్‌లో చెల్లింపులకు పేటీఎం టోల్‌ఫ్రీ నంబర్

Dec 7 2016 12:31 AM | Updated on Aug 28 2018 5:18 PM

ఆఫ్‌లైన్‌లో చెల్లింపులకు పేటీఎం టోల్‌ఫ్రీ నంబర్ - Sakshi

ఆఫ్‌లైన్‌లో చెల్లింపులకు పేటీఎం టోల్‌ఫ్రీ నంబర్

ఇంటర్నెట్ అవసరం లేకుండా ఆఫ్‌లైన్‌లో నగదు స్వీకరణ, చెల్లింపుల కోసం ప్రముఖ ఈ వ్యాలెట్ సంస్థ పేటీఎం టోల్‌ఫ్రీ

 హైదరాబాద్: ఇంటర్నెట్ అవసరం లేకుండా ఆఫ్‌లైన్‌లో నగదు స్వీకరణ, చెల్లింపుల కోసం ప్రముఖ ఈ వ్యాలెట్ సంస్థ పేటీఎం టోల్‌ఫ్రీ నంబర్ 180018001234ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు, వ్యాపారులు ముందుగా తమ మొబైల్ నంబర్‌తో పేటీఎంలో నమోదు చేసుకుని 4 అంకెలతో కూడిన పిన్ నంబర్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నగదు స్వీకరించాల్సిన వ్యక్తి మొబైల్‌లో... చెల్లించాల్సిన వ్యక్తి నగదు మొత్తం, పిన్ నంబర్‌ను ఎంటర్ చేయగానే ఒక వ్యాలట్ నుంచి మరో వ్యాలట్‌కు నగదు బదిలీ అయిపోతుంది. ఈ ప్రక్రియకు టోల్ ఫ్రీనంబర్ ఆధారంగా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్లు లేకపోయినా నగదు రహిత చెల్లింపులు, స్వీకరణలకు ఇది వీలు కల్పిస్తుందని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నితిన్‌మిశ్రా తెలిపారు

Advertisement
 
Advertisement
Advertisement