ఆర్‌బీఐ అనుమతి అవసరం లేదు | The central bank does not need permission | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ అనుమతి అవసరం లేదు

Jun 26 2015 1:27 AM | Updated on Sep 3 2017 4:21 AM

అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రిజర్వ్ బ్యాంక్ అనుమతులు లేకుండానే బ్యాంకులు నిధులు సమీకరించచవచ్చు.

ముంబై : అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి  రిజర్వ్ బ్యాంక్ అనుమతులు లేకుండానే బ్యాంకులు నిధులు సమీకరించచవచ్చు. దీనికి సంబంధించిన నిబంధనలను ఆర్‌బీఐ సడలించింది. భారత ప్రభుత్వం ఒక వాటాదారుగా ఉన్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నుంచి బ్యాంకులు రుణాలు తీసుకోవచ్చని, దీనికి తమ నుంచి ఎలాంటి అనుమతులూ అక్కర్లేదని ఆర్‌బీఐ పేర్కొంది. అయితే ఈ నిధులను బ్యాంకులు మూలధన అవసరాలకు కాకుండా సాధారణ బ్యాంక్ కార్యకలాపాలకు మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టంచే సింది. ఇక డిపాజిట్లు స్వీకరించని బ్యాంకేతర ఆర్థిక సంస్థలు(ఎన్‌బీఎఫ్‌సీ) ఆర్‌బీఐ అనుమతి లేకుండానే మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీస్ స్కీమ్స్(ఎంటీఎస్‌ఎస్) సబ్-ఏజెంట్లుగా వ్యవహరించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement