టెస్లా మోడల్‌-3 ఎలక్ట్రిక్‌ కారు, రెండులక్షల బుకింగ్స్

టెస్లా మోడల్‌-3 ఎలక్ట్రిక్‌ కారు, రెండులక్షల బుకింగ్స్ - Sakshi




న్యూఢిల్లీ


పెనుభూతంలా తరుముకొస్తున్న వాయుకాలుష్య  భయంతో ఎకో కార్లకు, ఎలక్ట్రిక్ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్  పెరుగుతోంది. ఈ నేపథ్యంలో  అమెరికాకు చెందిన టెస్లా మోటార్స్‌ కంపెనీ మోడల్‌-3 ఎలక్ట్రిక్‌ కారును విడుదలచేసింది. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలకోసం పరిశోధనలు చేస్తూ  తన కంటూ ప్రత్యేక  స్థానాన్ని సంపాదించుకున్న టెస్లా  తమ ఎలక్ట్రిక్ సెన్సేషన్  కారును మార్కెట్ లో లాంచ్  చేసింది.   ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న  టెస్లా మోడల్‌-3 ఎలక్ట్రిక్‌ కారు విడుదల కాగానే  దీనికోసం టెక్నాలజీ ప్రియులు, కారు ప్రియులు  క్యూ కట్టారు.



తాజాగా లాంచ్  చేసిన   ఎలక్ట్రిక్ కార్ మోడల్ 3 బేసిక్‌ మోడల్ ధర ఇంతకుముందెన్నడూ లేని అందుబాటు ధరలో   35వేల డాలర్ల(సుమారు రూ.23లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 346 కి.మీ.లు ప్రయాణించవచ్చు. 2017 చివరిలో ఈ కారు డెలివరీలు ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఏడాదికి 5లక్షల వాహనాలు ఉత్పత్తి చేయాలన్నది తమ లక్ష్యమని తెస్లా  సీఈవో ఎలోన్‌  మస్క చెప్పారు.  ప్రస్తుతం అంతర్జాతీయ రోడ్లపై కనిపించే  టూ అండ్ త్రి  సీట్ల కార్లలో ఇది చవకైనదనీ  6 సెకన్లలో60కి.మీ వేగంతో దూసుకెళుతుందని తెలిపారు. ఇప్పటికే 2 లక్షల 32 వేల ముందస్తు ఆర్డర్లు వచ్చినట్టు   మస్క తెలిపారు. కంపెనీ నుంచి విడుదలైన అతి తక్కువ ధర ఎలక్ట్రిక్‌ కారు ఇదే. .  




 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top