కెమాన్‌ సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు | TECNO Mobile launches 3 affordable smartphones | Sakshi
Sakshi News home page

కెమాన్‌ సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు

Sep 27 2018 1:19 AM | Updated on Sep 27 2018 1:19 AM

TECNO Mobile launches 3 affordable smartphones - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్‌ టెక్నో మొబైల్‌ తాజాగా కెమాన్‌ సిరీస్‌లో మూడు మోడళ్లను బుధవారం ప్రవేశపెట్టింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌ సాంకేతికతో కూడిన కెమెరాలు వీటి ప్రత్యేకత అని టెక్నోను ప్రమోట్‌ చేస్తున్న ట్రాన్సియాన్‌ ఇండియా సీఎంవో గౌరవ్‌ టికూ మీడియాకు తెలిపారు. ఎలాంటి వెలుతురులోనైనా చిత్రాలను తీయగలదని చెప్పారు. లైటింగ్‌ కండీషన్, బ్రైట్‌నెస్‌ ఆధారంగా సీన్‌ను అంచనా వేసి ఫోటోకు అందాన్ని తెచ్చేందుకు ఆటో సీన్‌ డిటెక్షన్‌ ఫీచరును పొందుపరిచారు.

6.2 అంగుళాల 19:9 సూపర్‌ ఫుల్‌ వ్యూ హెచ్‌డీ డిస్‌ప్లే, ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌ ఫేస్‌ అన్‌ లాక్, ఆన్‌డ్రాయిడ్‌ 8.1 ఓఎస్, 3,750 ఎంఏహెచ్‌ బ్యాటరీ వీటికి పొందు పరిచారు. ధరల శ్రేణి రూ.8,999–రూ.12,499.  100 రోజుల్లో రీప్లేస్‌మెంట్‌ వారంటీ, వన్‌ టైం స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ను అందిస్తోంది. హాంగ్‌కాంగ్‌ కేంద్రంగా ఉన్న ట్రాన్సియాన్‌ 50 దేశాల్లో ఐటెల్, ఇన్‌ఫినిక్స్, టెక్నో బ్రాండ్లలో ఫోన్లను అమ్ముతోంది.2017లో మొత్తం 13 కోట్ల ఫోన్లు విక్రయించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement