ఇన్ఫోసిస్‌లో కొలువుల కోత.. | Tech Gaint Infosys Is Laying Off People | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌లో కొలువుల కోత..

Nov 5 2019 11:55 AM | Updated on Nov 5 2019 4:10 PM

Tech Gaint Infosys Is Laying Off People - Sakshi

కాగ్నిజెంట్‌ బాటలోనే టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సైతం ఉద్యోగులపై వేటు వేయనుంది.

బెంగళూర్‌ : కాగ్నిజెంట్‌ బాటలో దేశీ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సైతం ఉద్యోగాల్లో కోత విధించనుంది. పెద్దసంఖ్యలో ఎగువ శ్రేణి ఉద్యోగులను ఇంటికి పంపాలని యోచిస్తోంది. దాదాపు 2200 మంది సీనియర్‌ మేనేజర్లను సాగనంపాలని కంపెనీ నిర్ణయించినట్టు సమాచారం. జూనియర్‌, మిడిల్‌ లెవెల్‌ అసోసియేట్లను సైతం 2 నుంచి 5 శాతం వరకూ తొలగించవచ్చని ఓ ఆంగ్ల దినపత్రిక కథనం వెల్లడించింది. మరోవైపు అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌, వైస్‌ ప్రెసిడెంట్స్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌ వంటి సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ల్లో 50 మంది వరకూ ఉద్యోగాల నుంచి తప్పుకోవాలని కోరనుందని సమాచారం. గతంలో సామర్ధ్యం ఆధారంగా ఉద్యోగులను తొలగించే ఇన్ఫోసిస్‌ ఈసారి భారీ సంఖ్యలో సిబ్బందిపై వేటు వేయడం అసాధారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఆటోమేషన్‌ రాకతో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే ధోరణి పెరిగిందని హెచ్‌ఆర్‌ నిపుణులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement