టాటా మోటార్స్‌ నుంచి కొత్త పికప్‌ ట్రక్‌ ‘జెనాన్‌ యోధ’ | Tata Motors launches pick-up truck Xenon Yodha priced at Rs 6.04 lakh | Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్‌ నుంచి కొత్త పికప్‌ ట్రక్‌ ‘జెనాన్‌ యోధ’

Jan 4 2017 12:09 AM | Updated on Sep 5 2017 12:19 AM

టాటా మోటార్స్‌ నుంచి కొత్త పికప్‌ ట్రక్‌ ‘జెనాన్‌ యోధ’

టాటా మోటార్స్‌ నుంచి కొత్త పికప్‌ ట్రక్‌ ‘జెనాన్‌ యోధ’

దేశీ దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్‌’ తాజాగా తన కొత్త పికప్‌ వెహికల్‌ ‘టాటా జెనాన్‌ యోధ’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

ప్రారంభ ధర రూ.6.05 లక్షలు
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్‌’ తాజాగా తన కొత్త పికప్‌ వెహికల్‌ ‘టాటా జెనాన్‌ యోధ’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.6.05 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉంది. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న ఈ వాహనం 4 .2, 4 .4 వేరియంట్లలో సింగిల్, డబుల్‌ క్యాబ్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. బీఎస్‌–3, బీఎస్‌–4 నిబంధనలకు అనువుగా తయారైన ఈ వాహనాల్లో 3 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చామని కంపెనీ పేర్కొంది. సింగిల్‌ క్యాబ్‌లో బీఎస్‌–3 వెర్షన్‌ వేరియంట్‌ ధర రూ.6.05 లక్షల నుంచి,  బీఎస్‌–4 వెర్షన్‌ వేరియంట్‌ ధర రూ.6.19 లక్షల నుంచి ప్రారంభమౌతుందని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement