టాటా మోటార్స్ అంతర్జాతీయ వాహన విక్రయాలు 11% అప్ | Tata Motors: Getting a JLR boost | Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్ అంతర్జాతీయ వాహన విక్రయాలు 11% అప్

Apr 12 2016 12:48 AM | Updated on Sep 3 2017 9:42 PM

టాటా మోటార్స్ అంతర్జాతీయ వాహన విక్రయాలు 11% అప్

టాటా మోటార్స్ అంతర్జాతీయ వాహన విక్రయాలు 11% అప్

టాటా మోటార్స్ అంతర్జాతీయ వాహన విక్రయాలు మార్చి నెలలో వృద్ధి చెందాయి. జాగ్వార్ లాండ్ రోవర్(జేఎల్‌ఆర్)తో సహా గ్లోబల్ వాహన విక్రయాలు

న్యూఢిల్లీ: టాటా మోటార్స్ అంతర్జాతీయ వాహన  విక్రయాలు మార్చి నెలలో వృద్ధి చెందాయి. జాగ్వార్ లాండ్ రోవర్(జేఎల్‌ఆర్)తో సహా గ్లోబల్ వాహన విక్రయాలు 11% వృద్ధితో 1,18,750 యూనిట్లకు పెరిగాయని కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే నెలలో కంపెనీ వాహన విక్రయాలు 1,06,595 యూనిట్లుగా ఉన్నాయని టాటా మోటార్స్ బీఎస్‌ఈకి నివేదించింది. ఇక ప్యాసెంజర్ వాహన విక్రయాలు 8% వృద్ధితో 68,109 యూనిట్ల నుంచి 73,515 యూనిట్లకు పెరిగాయని తెలిపింది. లగ్జరీ బ్రాండ్ జేఎల్‌ఆర్ వాహన విక్రయాలు 22 శాతం వృద్ధితో 52,736 యూనిట్ల నుంచి 64,579 యూనిట్లకు ఎగశాయని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement