సిండికేట్ బ్యాంక్ చైర్మన్ సస్పెన్షన్ | Syndicate Bank Chairman SK jain suspended | Sakshi
Sakshi News home page

సిండికేట్ బ్యాంక్ చైర్మన్ సస్పెన్షన్

Aug 4 2014 6:36 PM | Updated on Aug 20 2018 4:27 PM

లంచం కేసులో అరెస్టయిన సిండికేట్ బ్యాంక్ చైర్మన్ ఎస్ కే జైన్ను సస్పెండ్ చేశారు.

న్యూఢిల్లీ: లంచం కేసులో అరెస్టయిన సిండికేట్ బ్యాంక్ చైర్మన్ ఎస్ కే జైన్ను సస్పెండ్ చేశారు. ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు బాధ్యతలకు అప్పగించారు.

నిబంధనలకు విరుద్ధంగా పలు కంపెనీలకు రుణ పరిమితి పెంచేందుకు రూ. 50 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై ఎస్.కె.జైన్ సహా ఆరుగురిని సీబీఐ శనివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  జైన్ తరఫున లంచం తీసుకుంటున్న ఆయన బావమరిదిని, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్‌ను అరెస్ట్ చేశారు. అలాగే బెంగళూరు, భోపాల్, ఢిల్లీ, ముంబైలలోని 20 ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి సీబీఐ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. జైన్ నివాసం నుంచి రూ.21 లక్షల నగదు, రూ.1.68 కోట్ల విలువైన బంగారం, రూ.63 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైన్‌తోపాటు మరో 11 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement