
సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ సిలిండర్ ధర రూ.2.08లు, నాన్ సబ్సిడీ సిలిండర్ ధరను రూ.42.50 చొప్పున పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసిఎల్) ప్రకటించింది.అంతర్జాతీయంగా చమురు ధరలు, డాలరు మారకంలో రూపాయి ఒడిదుడుకుల నేపథ్యంలో దేశీయంగా కూడా గ్యాస్ ధరలు ప్రభావితమైనట్టు పేర్కొంది. నేటి (మార్చి 1) నుంచి ఈ సవరించిన రేట్లు అమలు కానున్నాయి.