స్టూడియో అపార్ట్‌మెంట్‌  రూ.11.20 లక్షలు!

Studio Apartment Rs.11.20 Lakh - Sakshi

శ్రీ శ్రీ గృహ నిర్మాణ్‌ నుంచి ఎయిరో సిటీ

6 ఎకరాల్లో 620 గృహాల నిర్మాణం

సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, అందుబాటు ధరల్లో నివాస, లే అవుట్‌ ప్రాజెక్ట్‌లను నిర్మించే శ్రీ శ్రీ గృహ నిర్మాణ్‌ ఇండియా.. ఎయిరో సిటీ పేరిట సుందరమైన ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇబ్రహీంపట్నం మంగల్‌పల్లిలో 6 ఎకరాల్లో నిర్మిస్తున్న గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి కొనుగోలుదారులకు అందిస్తామని కంపెనీ ఎండీ భూపతి రాజు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ప్రాజెక్ట్‌ పూర్తి వివరాలు... 

►6 లక్షల చ.అ. బిల్టప్‌ ఏరియాలో 620 గృహాలను నిర్మిస్తున్నాం. 10 బ్లాక్‌లు. ఒక్కో బ్లాక్‌ సెల్లార్, స్టిల్ట్‌ ప్లస్‌ 7 అంతస్తుల్లో ఉంటుంది. 350 చ.అ. స్టూడియో అపార్ట్‌మెంట్స్, 750 చ.అ.లలో సింగిల్‌ బెడ్‌ రూమ్, 1000 చ.అ.ల్లో 2 బీహెచ్‌కే, 1450 చ.అ.ల్లో 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.3500. సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ధర రూ.31.25 లక్షలు, స్టూడియో అపార్ట్‌మెంట్‌ ధర సౌకర్యాలతో (పార్కింగ్‌ రూ.2.50 లక్షలు, వసతులకు రూ.2.50 లక్షలు) రూ.16.20 లక్షలు. 

►  2016లో ఎయిరో సిటీ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఈ నెల ముగింపు నాటికి ప్రాజెక్ట్‌ పూర్తవుతుంది. 50, 40, 30 ఫీట్ల రోడ్లు, 24 గంటల పాటు సెక్యూరిటీ, ఇంటర్‌కామ్‌ ఫెసిలిటీ, పవర్‌ బ్యాకప్‌ జనరేటర్‌ ఉంటాయి. సగానికి పైగా ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. ఈ ప్రాజెక్ట్‌కు ఎదురుగానే 34 ఎకరాల్లో ఎయిరో పార్క్‌ సౌత్‌ పేరిట లే అవుట్‌ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. 

రోజూ 25 వేల మంది ఉద్యోగులు.. 
►తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆదిభట్ల, పటేల్‌గూడ, రావిర్యాల, కొంగర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఐటీ, ఎయిరో స్పేస్‌ కంపెనీలతో పాటూ కొంగరలో కలెక్టరాఫీసు ఏర్పాటుతో స్థిరమైన అభివృద్ధి జరుగుతుంది. స్థానికంగా  పెద్దగా గృహ అవసరాలు లేకపోవటంతో ప్రతి రోజు టీసీఎస్, కాగ్నిజెంట్, టాటా అడ్వాన్స్, బీడీఎల్, ఆక్టోపస్‌ వంటి కంపెనీలకు, స్థానిక ప్రభుత్వ కార్యాలయాలకు 25 వేల మంది హైదరాబాద్‌ నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గృహాలకు డిమాండ్‌ విపరీతంగా ఉంది.  

►18 వేల చ.అ.ల్లో క్లబ్‌ హౌస్‌ ఉంటుంది. ల్యాండ్‌ స్కేపింగ్, స్విమ్మింగ్‌ పూల్, జిమ్, మెడిటేషన్, పార్టీ హాల్స్, మినీ థియేటర్, షటిల్‌ కోర్టు, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, జాగింగ్‌ ట్రాక్, రెస్టారెంట్, సూపర్‌ మార్కెట్, విజిటర్స్‌ లాంజ్‌ వంటి ఏర్పాట్లుంటాయి. ప్రాజెక్ట్‌ ఆవరణలో అపోలో ఆసుపత్రి క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. 24 గంటలు డాక్టర్, నర్సు అందుబాటులో ఉంటారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top