
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. కానీ వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 19 పాయింట్లు, నిఫ్టీ 2 పాయింట్లు క్షీణించి కొనసాగుతున్నాయి. డాలరు బలహీనత నేపథ్యంలో ఐటీ షేర్లు లాభపడుతున్నాయి. ఎల్ అండ్‌టీ, బయోకాన్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, జెట్ ఎయిర్‌వేస్, టెక్ మహీంద్ర లాభపడుతున్నాయి. కోల్‌ఇండియా, టాటా మోటార్స్, అల్ట్రా టెక్ సిమెంట్, గ్రాసిం తదితర షేర్లు నష్టపోతున్నాయి.
మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు మరోసారి నింగివైపు చూస్తున్నాయి. బ్యారెల్ ధర 70 డాలర్లను తాకింది. అటు డాలరు మారకంలో రూపాయి బలహీనంగాకొనసాగుతోంది. శుక్రవారం నాటి ముగింపు 71.22తోపోలిస్తే సోమవారం 14పైసల నష్టంతో రూ.71.30 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. ప్రస్తుతం 7.139 వద్ద ఉంది.