స్ప్లెండర్ ప్రో కొత్త వేరియంట్ ధర రూ.46,850 | Splendour Pro new variant | Sakshi
Sakshi News home page

స్ప్లెండర్ ప్రో కొత్త వేరియంట్ ధర రూ.46,850

Oct 13 2015 12:21 AM | Updated on Sep 3 2017 10:51 AM

స్ప్లెండర్ ప్రో కొత్త వేరియంట్ ధర రూ.46,850

స్ప్లెండర్ ప్రో కొత్త వేరియంట్ ధర రూ.46,850

హీరో మోటొకార్ప్ కంపెనీ స్ప్లెండర్ ప్రొ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది.

న్యూఢిల్లీ: హీరో మోటొకార్ప్ కంపెనీ స్ప్లెండర్ ప్రొ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. నేటి (మంగళవారం) నుంచి విక్రయాలు ప్రారంభమయ్యే ఈ బైక్ ధర రూ.46,850 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)అని హీరో మోటొకార్ప్ తెలిపింది. ఇటీవలే ఆవిష్కరించిన కొత్త స్కూటర్ మోడల్ మ్యాస్ట్రో ఎడ్జ్ (ధర రూ.49,500(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)) విక్రయాలు కూడా మంగళవారం నుంచే ప్రారంభిస్తామని పేర్కొంది. అంతే కాకుండా స్ప్లెండర్ ప్లస్‌లో సెల్ఫ్-స్టార్ట్ ఉన్న కొత్త వేరియంట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని వివరించింది.

1994లో స్ప్లెండర్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటిదాకా 2.5 కోట్లు విక్రయించామని హీరో మోటొకార్ప్ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement