సోని కొత్త ఫోన్‌ ఆన్‌లైన్‌లో చక్కర్లు | Sony Xperia XA2 Ultra with dual selfie cameras spotted online | Sakshi
Sakshi News home page

సోని కొత్త ఫోన్‌ ఆన్‌లైన్‌లో చక్కర్లు

Jan 3 2018 11:29 AM | Updated on Jan 3 2018 11:31 AM

Sony Xperia XA2 Ultra with dual selfie cameras spotted online - Sakshi

సోని నుంచి కొత్తగా విడుదల కాబోతున్న స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ2 ఆల్ట్రా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ డివైజ్‌ బార్సిలోనాలో జరుగబోతున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ 2018లో ఆవిష్కరించబోతున్నట్టు తెలిసింది. హెచ్‌4233 నెంబర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆన్‌లైన్‌లో స్పాట్‌ అయింది. ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ1 ఆల్ట్రాకు సక్ససర్‌గా ఈ డివైజ్‌ను సోని మార్కెట్‌లోకి విడుదల చేయబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు కుడి, ఎడమ రెండు వైపుల పలుచైన బెజెల్స్‌ కలిగి ఉండనున్నాయి. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న రూమర్ల ప్రకారం సోని ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 6 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండనున్నట్టు తెలుస్తోంది.
 

మిగిలిన ఫీచర్లు...
1920 x 1080 పిక్సెల్స్‌ రెజుల్యూషన్‌
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 630 ప్రాసెసర్‌
4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో
రెండు ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరాలు
కొన్ని నెలల కిత్రమే సోని తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌1ను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఈ డివైజ్‌ మెటల్‌ యూనిబాడీ డిజైన్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement