స్నాప్‌డీల్‌ సేల్‌: డిస్కౌంట్‌లో కొత్త ఐఫోన్లు | Snapdeal Sale: Apple iPhone 8, 8 Plus Get Rs 13,000 Discount | Sakshi
Sakshi News home page

స్నాప్‌డీల్‌ సేల్‌: డిస్కౌంట్‌లో కొత్త ఐఫోన్లు

Oct 3 2017 1:37 PM | Updated on Aug 14 2018 4:01 PM

Snapdeal Sale: Apple iPhone 8, 8 Plus Get Rs 13,000 Discount - Sakshi

ఈ-కామర్స్‌ కంపెనీల్లో ఫెస్టివల్‌ సీజన్‌ ఇంకా నడుస్తూనే  ఉంది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ తర్వాత స్నాప్‌డీల్‌ తన 'అన్‌బాక్స్‌ దివాలి సేల్‌''ను కొనసాగిస్తోంది. రెండో రౌండ్‌ నిర్వహిస్తున్న ఈ సేల్‌ నేటితో ముగియనుంది. ఈ సేల్‌లో భాగంగా ఆపిల్‌ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఐఫోన్లపై బంపర్‌ డిస్కౌంట్లను ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డులతో కొత్త ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌లను కొనుగోలు చేస్తే, తక్షణ డిస్కౌంట్‌ కింద రూ.13వేల వరకు స్నాప్‌డీల్‌ అందిస్తోంది.

పరిమిత యూనిట్లపై ఈ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తున్నట్టు స్నాప్‌డీల్‌ చెప్పింది. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ బేసిస్‌లో డిస్కౌంట్‌ను అందుబాటులో ఉంచింది. అదనంగా స్టాండర్డ్‌ ఛార్టడ్‌, యస్‌ బ్యాంకు కార్డులపై రూ.2500 కంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేపడితే, ఫ్లాట్‌ 20 శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. ప్రతికార్డుపైనా రూ.1500 వరకు డిస్కౌంట్‌ను స్నాప్‌డీల్‌ ఆఫర్‌ చేస్తోంది. 


అంతేకాక గూగుల్‌ పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ను 58వేల రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో గూగుల్‌ పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై రూ.22వేల వరకు ఆదాచేసుకోవచ్చు. సేల్‌ డేస్‌లో ఆఫర్లకు అదనంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంకు హోల్డర్స్‌కు అక్టోబర్‌ 3 నుంచి ప్రతి మంగళవారం ఫ్లాట్‌ 10 శాతం తగ్గింపును ఇవ్వనుంది. అయితే రూ.1500 కంటే మించి కొనుగోలు చేపడితేనే ఈ తగ్గింపును స్నాప్‌డీల్‌ ఆఫర్‌ చేస్తుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement