
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ప్రతికూల నోట్‌తో ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. అనంతరం అమ్మకాల ఒత్తిడితో మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 132 పాయింట్లు కోల్పోయి 36108 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు బలహీనపడి 10851వద్ద కొనసాగుతోంది. దీంతో నిఫ్టీ10900 స్థాయిదిగువకు చేరింది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయిన సన్‌ఫార్మ లాభాల్లో కొనసాగుతోంది. అలాగే హార్లిక్స్ కొనుగోలు ప్రకటన అనంతరం హెచ్‌యూఎల్ కౌంటర్‌లో కొనుగోళ్ల ధోరణి నెలకొంది.
ఓఎన్‌జీసీ, సన్ ఫార్మా, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌టీపీసీ నష్టపోతున్నాయి. అటు అస్తుల అమ్మకానికి గ్రీన్‌సిగ్నల్ లభిస్తున్న తరుణంలో ఆర్ కామ్ మరో 5 శాతం లాభపడటం విశేషం.