స్టాక్‌ మార్కెట్లకు జీడీపీ సెగ.. | Sensex Plunges With RBI Growth Forecast Cut | Sakshi
Sakshi News home page

స్టాక్‌ మార్కెట్లకు జీడీపీ సెగ..

Oct 4 2019 5:08 PM | Updated on Oct 4 2019 5:11 PM

Sensex Plunges With RBI Growth Forecast Cut - Sakshi

గ్లోబల్‌ మార్కెట్ల బలహీన ట్రెండ్‌తో స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం డీలాపడ్డాయి.

ముంబై : జీడీపీ అంచనాలను ఆర్‌బీఐ తగ్గించడం, వడ్డీరేట్లలో కోత వంటి చర్యలతో స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. వడ్డీ రేట్ల తగ్గింపుతో బ్యాంకు షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.9 నుంచి 6.1 శాతానికి ఆర్‌బీఐ కుదించడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 434 పాయింట్ల నష్టంతో 37,673 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక 139 పాయింట్లు నష్టపోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,174 పాయింట్ల వద్ద క్లోజయింది. బ్యాంకింగ్‌ సహా పలు రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement