బ్యాంకుల దెబ్బ, చివరికి నష్టాలు

Sensex Ends Over 250 Points Lower Dragged By Banks - Sakshi

9250  దిగువకు  నిఫ్టీ

బ్యాంకు షేర్లలో అమ్మకాలు

సాక్షి,ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. 500 పాయింట్లకుపైగా లాభంతోప్రారంభమైన మార్కెట్ రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. లాభ నష్టాల మధ్య  ఊగిసలాడుతో చివరికి నష్టాల్లోనే ముగిసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసిజి షేర్లలో నష్టాలు, అమ్మకపు ఒత్తిడి నేపథ్యంలో సెన్సెక్స్  డే హై నుంచి 860 పాయింట్ల వరకు పడిపోయింది. నిఫ్టీ కీలక స్థాయి 9250 కంటే దిగువకు పడిపోయింది.  చివరికి సెన్సెక్స్ 0.8 శాతం లేదా 262 పాయింట్లు తగ్గి 31454 వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 0.95 శాతం లేదా 88 పాయింట్లు పడిపోయి 9206  వద్ద స్థిరపడింది. నిఫ్టీ  హైనుంచి 951 పాయింట్లు నష్టపోయింది. సమీప కాలంలో నిఫ్టీ 8,900 స్థాయిలకు క్షీణించే అవకాశం వుందనిని ప్రూడెంట్ బ్రోకింగ్ సర్వీసెస్ ప్రదీప్ అభిప్రాయపడ్డారు. 

ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, టాటా మోటార్స్, ఆసియన్ పెయింట్స్,యాక్సిస్  బ్యాంకు, కోటక్ మహీంద్ర బ్యాంకు, విప్రో, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, డా. రెడ్డీస్ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.  మరోవైపు ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, రిలయన్స్, జీ, ఎన్టీపీసీ ఐషర్  మోటార్స్, హెచ్సీఎల్ టెక్  లాభపడ్డాయి.  (షార్ట్ కవరింగ్ : 9400 ఎగువకు నిఫ్టీ)

చదవండి :  వారి రుణాలు రద్దు చేయాలి : అభిజిత్ బెనర్జీ
270 కోట్ల తప్పుడు ప్రకటనలు తొలగించాం: గూగుల్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top