ఆయిల్ దెబ్బ, మార్కెట్ల పతనం | sensex crashes nearly 1000 points  | Sakshi
Sakshi News home page

ఆయిల్ దెబ్బ, మార్కెట్ల పతనం

Apr 21 2020 9:37 AM | Updated on Apr 21 2020 12:28 PM

sensex crashes nearly 1000 points  - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్  ఆరంభించాయి. అంతర్జాతీ ప్రతికూల సంకేతాలు, అంతర్జాతీయ  చమురు ధరలు భారీగా పతనం కావడంతో మన ఈక్విటీ మార్కెట్లు గత రెండు సెషన్ల లాభాలను కోల్పోయాయి  దీంతో  సెన్సెక్స్ 31 వేల స్థాయిని, నిఫ్టీ 91 వందల స్థాయిని కోల్పోయి నెగెటివ్ జోన్ లోకి జారుకున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా  బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. దీంతో  సెన్సెక్స్ 31  వేల స్థాయిని, నిఫ్టీ 9 వేల స్థాయిని కోల్పోయి నెగెటివ్ జోన్ లోకి  జారుకున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 903 పాయింట్లు కోల్పోయి 30742 వద్ద, నిఫ్టీ 262 పాయింట్లు నష్టంతో 8999 వద్ద కొనసాగుతోంది.  గెయిల్, హిందాల్కో, వేదాంతా,  బజాజ్ ఫైనాన్స్, ఓఎన్ జీసీ,టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి సుజుకి,  టాటా మోటార్స్, జెఎస్ డబ్ల్యూ స్టీల్ భారీగా నష్టపోతున్నాయి. నిఫ్టీ బ్యాంకు  3.5 శాతం క్షీణించి 20 వేల దిగువకు చేరగా,  ఫార్మ, ఎఫ్ ఎంసీజీ  భారీ నష్టాలనుంచి స్వల్పంగా  పుంజుకుంటున్నాయి. యూఎస్ ఎఫ్ డీఏ అనుమతులతో అరబిందో ఫార్మా  దాదాపు 10 శాతం లాభపడుతోంది. అలాగే డాక్టర్‌ రెడ్డీస్‌ ఐటీసీలు ఒకశాతానికి పైగా లాభంతో ఉన్నాయి. (ఆల్ టైం కనిష్టానికి రూపాయి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement