సహారాకు ‘శాట్‌’ షాక్‌! | Securities Appellate Tribunal upholds Sebi order against Sahara | Sakshi
Sakshi News home page

సహారాకు ‘శాట్‌’ షాక్‌!

Jul 29 2017 12:39 AM | Updated on Sep 5 2017 5:05 PM

సహారాకు ‘శాట్‌’ షాక్‌!

సహారాకు ‘శాట్‌’ షాక్‌!

తన మ్యూచువల్‌ ఫండ్‌ లైసెన్స్‌ను రద్దుచేస్తూ, సెబీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ

ఫండ్‌ లైసెన్స్‌ రద్దుపై సెబీ ఉత్తర్వుల కొట్టివేతకు నో...
సుప్రీంకు వెళ్లడానికి 6వారాల గడువు!  

ముంబై: తన మ్యూచువల్‌ ఫండ్‌ లైసెన్స్‌ను రద్దుచేస్తూ, సెబీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ, సహారా దాఖలు చేసుకున్న పిటిషన్‌ను శుక్రవారం సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) తోసిపుచ్చింది. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ఆరు వారాల గడువును మంజూరు చేసింది.  సహారా మ్యూచువల్‌ ఫండ్‌  ‘సర్టిఫికెట్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌’ను రద్దు చేస్తూ జూలై 2015లో ఉత్తర్వులు ఇచ్చింది.

ఇన్వెస్టర్ల నుంచి ఎటువంటి నిధులూ ఫండ్‌ హౌస్‌ను సేకరించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యాపార నిర్వహణకు సంస్థకు సామర్థ్యం లేదని గుర్తించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత ఉత్తర్వుల్లో తెలిపింది. అప్పటి బిజినెస్‌ మొత్తాన్ని మరొక ఫండ్‌ హౌస్‌కు బదలాయించాలనీ స్పష్టంచేసింది. లేదా అప్పటికే సమీకరించిన నిధులను తిరిగి ఇన్వెస్టర్లకు చెల్లించేయాలని ఆదేశించింది.

ఇరు వర్గాల వాదనలూ విన్న శాట్,.. ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన అన్ని చర్యలూ తీసుకునే అధికారాలు సెబీకి ఉంటాయని శాట్‌ తన రూలింగ్‌లో స్పష్టం చేసింది. రెండు గ్రూప్‌ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా భారీ నిధుల (దాదాపు రూ. 25,000 కోట్లు) సమీకరణ, తిరిగి చెల్లింపుల్లో వైఫల్యం అంశాన్నీ శాట్‌ ప్రస్తావించింది.

సహారా లైఫ్‌ టేకోవర్‌పై ఐఆర్‌డీఏ సూచనలు..
జులై 31 నుంచి సహారా ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను టేకోవర్‌ చేయాల్సిందిగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ కు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ సూచించింది. సహారా లైఫ్‌ను టేకోవర్‌ చేయాలంటూ 6 బీమా సంస్థలకు ఐఆర్‌డీఏ లేఖ రాయగా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ముందుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement