
ఇంజనీరింగ్ మేజర్ లార్సన్ అండ్ టుబ్రోకు సెబీ నిరాశను మిగిల్చింది. రూ. 9వేల కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్ ఆఫర్‌కు సెబీ అనుమతినివ్వలేదు. ఈ మేరకు ఎల్ అండ్ టీ శనివారం రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది. సెబి నిబంధనలకు అనుగుణంలేని కారణంగా బై బ్యాక్ ఆఫర్‌ను తిరస్కరించిందని పేర్కొంది.
కాగా ఈక్విటీ షేరు రూ. 1475 వద్ద సుమారు 6.1 కోట్ల షేర్లను బై బ్యాక్ చేయనున్నామని గత ఏడాది ఆగస్టులో ప్రతిపాదించింది.