సెబీ నిషేధం | Sebi bars 4 entities in 15-year-old Tata Finance matter | Sakshi
Sakshi News home page

సెబీ నిషేధం

Jun 22 2016 1:07 AM | Updated on Sep 4 2017 3:02 AM

సెబీ నిషేధం

సెబీ నిషేధం

టాటా ఫైనాన్స్‌కు చెందిన మాజీ ఎండీ, డి. ఎస్. పెండ్సే, మరో మూడు సంస్థలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది.

టాటా ఫైనాన్స్ రైట్స్ ఇష్యూ కేసు
న్యూఢిల్లీ: టాటా ఫైనాన్స్‌కు చెందిన మాజీ ఎండీ, డి. ఎస్. పెండ్సే, మరో మూడు సంస్థలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. 2001 నాటి టాటా ఫైనాన్స్ రైట్స్ ఇష్యూ కేసులో మోసాలకు పాల్పడ్డారంటూ సెబీ ఈ నిషేధం విధించింది. పెండ్సేపై మూడేళ్లు, టాటా ఫైనాన్స్ అనుబంధ సంస్థ నిస్‌కల్ప్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడింగ్ మాజీ సీఈఓ ఎ. ఎల్. సిలోత్రితో పాటు ప్యాట్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్, సుపీరియర్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లు క్యాపిటల్ మార్కెట లావాదేవీల్లో పాల్గొనకుండా  సెబీ నిషేధం విధించింది. పెండ్సే, సిలోత్రిలు ఏ లిస్టెడ్ కంపెనీల్లో  ఎలాంటి కీలకమైన మేనేజర్ స్థాయి పదవులు మూడేళ్లపాటు పొందరాదని కూడా సెబీ నిషేధం విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement