కమోడిటీ డెరివేటివ్స్‌లోకి విదేశీ సంస్థలకు అనుమతి | Sebi allows foreign entities in commodity derivatives market | Sakshi
Sakshi News home page

కమోడిటీ డెరివేటివ్స్‌లోకి విదేశీ సంస్థలకు అనుమతి

Oct 10 2018 12:28 AM | Updated on Oct 10 2018 12:28 AM

Sebi allows foreign entities in commodity derivatives market - Sakshi

న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌కు విదేశీ సంస్థలను అనుమతించాలని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నిర్ణయించింది. భారత్‌లో కమోడిటీ మార్కెట్‌తో (ఫిజికల్‌ మార్కెట్‌) లావాదేవీలు (ఎగుమతులు/దిగుమతులు) జరిపే విదేశీ సంస్థలను కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్లోకి అనుమతించాలని సెబీ నిర్ణయం తీసుకుంది.

కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్‌ను మరింత విస్తృతం చేసే వ్యూహంలో భాగంగా సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. కమోడిటీ మార్కెట్‌తో లావాదేవీలు జరిపే విదేశీ సంస్థలు ధరల అనిశ్చితి సమస్యను ఎదుర్కొం టాయని సెబీ పేర్కొంది. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ధరల నష్ట భయాన్ని హెడ్జింగ్‌ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం కోసం, సదరు విదేశీ సంస్థలను కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్లోకి అనుమతించాలని నిర్ణయించినట్లు సెబీ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement