భారీ క్యూఐపీకి తెరతీసిన ఎస్‌బీఐ

ముంబై: అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీకి క్యూఐపీ లాంచ్ చేసింది. ప్రైవేటు ప్లేస్మెంట్ ద్వారా రూ .287.58 కోట్ల షేర్లను విక్రయించనున్నట్టు సోమవారం ప్రకటించింది . ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ల నుంచి 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించే ప్రణాళికలో భాగంగా దీన్ని ప్రారంభించినట్టు మార్కెట్ ఫైలింగ్ లో తెలిపింది. సంస్థాగత కొనుగోలుదారులకు రూ .1 ముఖ విలువ గల షేర్ల 'క్వాలిఫైడ్ సంస్థాగత ప్లేస్మెంట్' ప్రారంభించినట్టు ఎస్‌బీఐ చెప్పింది.
సెబీ ధరల సూత్రం ఆధారంగా ఈ సమస్యపై ఫ్లోర్ ధర, బ్యాంకు యొక్క ఈక్విటీ వాటాకి 287.58 రూపాయలు ( 5 జూన్, 2017)గా నిర్ణయించింది. . అలాగే ఫ్లోర్ ధరకి 5 శాతానికి తగ్గకుండా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్యూఐపి ద్వారా ద్వారా రూ .11వేల కోట్లు నిధులు సేకరించాలని ఎస్‌బీఐ యోచిస్తోంది.
కాగా గత మార్చి ఎస్‌బీఐ సెంట్రల్ బోర్డు 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.15వేలకోట్ల ఈక్విటీ క్యాపిటల్ని పెంచుకోవడానికి అనుమతినిచ్చింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ , రైట్స్ ఇష్యూ, అమెరికన్ డిపాజిటరీ రిసీప్, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్, ఉద్యోగి స్టాక్ ఆప్షన్స్ ద్వారా బ్యాంకు నిధులను సేకరించటానికి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలతో ఎస్‌బీఐ బ్యాంకు స్టాక్ బిఎస్ఇలో 0.02 శాతం నష్టపోయి 287.35 వద్ద ముగిసింది.