బడ్జెట్‌ ధరల్లో శాంసంగ్ స్మార్ట్‌ టీవీలు | Samsung launches 2020 range of Crystal 4K UHD tvs | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ ధరల్లో శాంసంగ్ స్మార్ట్‌ టీవీలు

Jul 9 2020 2:28 PM | Updated on Jul 9 2020 4:50 PM

Samsung launches 2020 range of Crystal 4K UHD tvs - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ ఎల‌క్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త స్మార్ట్‌ టీవీలను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది.  2020 క్రిస్ట‌ల్ 4కె యూహెచ్‌డీ టీవీ, అన్‌బాక్స్ మ్యాజిక్ 3.0 టీవీ ల‌ను విడుద‌ల చేసింది. క్రిస్ట‌ల్ రేంజ్ టీవీలు 43, 50, 55, 65, 75 ఇంచ్ డిస్‌ప్లే సైజుల్లో అందుబాటులో ఉండగా. అన్‌బాక్స్ మ్యాజిక్ 3.0టీవీలు 32, 43 ఇంచ్ డిస్‌ప్లే సైజుల్లో ల‌భిస్తున్నాయి.

క్రిస్ట‌ల్ 4కె యూహెచ్‌డీ టీవీల్లో 4కె రిజ‌ల్యూషన్‌ను అందిస్తున్నారు. క్రిస్ట‌ల్ 4కె ప్రాసెస‌ర్ అమర్చింది. దీంతో క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా దృశ్యాలు క‌నిపిస్తాయని కంపెనీ చెబుతోంది. శాంసంగ్‌కు చెందిన బిక్స్‌బీ వాయిస్ అసిస్టెంట్‌తోపాటు అమెజాన్ అలెక్సా అసిస్టెంట్‌ను జోడించింది. అలాగే ఈ టీవీలను ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్‌గా కూడా వాడువ‌కోచ్చు. యూట్యూబ్‌, అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌, జీ5, ఈరోస్ నౌ, సోనీ లివ్‌, వూట్ త‌దిత‌ర యాప్స్‌ను ఈ టీవీల‌లో ఇన్‌బిల్ట్‌గా అందిస్తోంది.

ఈ టీవీల‌ను కొనుగోలు చేసేవారికి శాంసంగ్ ఉచితంగా ఆఫీస్ 365 స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను అందిస్తోంది. అలాగే 5జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ స్పేస్‌ను కూడా అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఫెడ‌ర‌ల్ బ్యాంక్‌, ఎస్‌బీఐ కార్డుల‌తో టీవీల‌ను కొంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభ్యం.

ధ‌రలు
అన్‌బాక్స్ మ్యాజిక్ 3.0
32 ఇంచుల టీవీ ధ‌ర రూ.20,900గా ఉంది. 
43 ఇంచుల టీవీ ధ‌ర రూ.41,900గా ఉంది.

క్రిస్ట‌ల్ 4కె యూహెచ్‌డీ సిరీస్‌
43 ఇంచుల టీవీ ధ‌ర 44,400 రూపాయలు 
50 ఇంచుల టీవీ ధ‌ర 60,900 రూపాయలు 
55 ఇంచుల టీవీ ధ‌ర 67,900 రూపాయలు 
65 ఇంచుల టీవీ ధ‌ర 1,32,900 రూపాయలు
75 ఇంచుల టీవీ ధ‌ర 2,37,900 రూపాయలు 

Advertisement
 
Advertisement
Advertisement