పాప్‌టైగర్‌లో వాటాలు పెంచుకున్న న్యూస్‌కార్ప్ | Rupert Murdoch-led News Corp raises stake in PropTiger | Sakshi
Sakshi News home page

పాప్‌టైగర్‌లో వాటాలు పెంచుకున్న న్యూస్‌కార్ప్

Jun 17 2015 1:37 AM | Updated on Oct 17 2018 4:54 PM

పాప్‌టైగర్‌లో వాటాలు పెంచుకున్న న్యూస్‌కార్ప్ - Sakshi

పాప్‌టైగర్‌లో వాటాలు పెంచుకున్న న్యూస్‌కార్ప్

ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ సేవల పోర్టల్ ప్రాప్‌టైగర్‌డాట్‌కామ్‌లో మీడియా దిగ్గజం న్యూస్‌కార్ప్ తన వాటాలను మరో 5 శాతం పెంచుకుంది.

ముంబై: ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ సేవల పోర్టల్ ప్రాప్‌టైగర్‌డాట్‌కామ్‌లో మీడియా దిగ్గజం న్యూస్‌కార్ప్ తన వాటాలను మరో 5 శాతం పెంచుకుంది. దీంతో మొత్తం వాటా 30 శాతానికి చేరింది. ప్రాప్‌టైగర్‌డాట్‌కామ్ మాతృసంస్థ ఎలరా టెక్నాలజీస్‌లో న్యూస్‌కార్ప్ వాటాలను పెంచుకోవడం ద్వారా ఇది సాధ్యపడింది. 2014 నవంబర్‌లో ఎలరాలో న్యూస్‌కార్ప్ 30 మిలియన్ డాలర్లతో 25% వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ, దీర్ఘకాలంలో ప్రాప్‌టైగర్‌డాట్‌కామ్‌కి పరిస్థితులు ఆశావహంగానే ఉండగలవని న్యూస్‌కార్ప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు నరిశెట్టి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement