మళ్లీ రూపాయి 68 దిగువకు... | rupee value decline | Sakshi
Sakshi News home page

మళ్లీ రూపాయి 68 దిగువకు...

May 19 2018 12:54 AM | Updated on May 19 2018 12:54 AM

rupee value decline - Sakshi

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం మళ్లీ కిందకు జారింది. వివరాల్లోకి వెళితే,  ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో మంగళవారం రూపాయి విలువ 16 నెలల కనిష్టస్థాయి 68.15 స్థాయికి చేరింది. అయితే బుధ, గురు వారాల్లో తిరిగి కొంత బలపడుతూ 67.70కి చేరింది. కాగా శుక్రవారం అనూహ్యంగా తిరిగి 30 పైసలు కనిష్టానికి పడింది. 68 వద్ద ముగిసింది.

అంతర్జాతీయంగా డాలర్‌లకు డిమాండ్, క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుదల, దేశంలో కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరుగుదల భయాలు వంటి అంశాలు రూపాయి పతనానికి కారణాల్లో కొన్ని. డాలర్‌ విలువ పెరుగుదల వల్ల ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్‌ భారీగా పెరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆర్‌బీఐ, అధికారులు రూపాయి తీవ్రంగా బలహీనపడకుండా కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, దేశం నుంచి భారీ క్యాపిటల్‌ అవుట్‌ఫ్లోస్‌ వల్ల దేశీయ కరెన్సీ బలహీనబాట ఆగడం లేదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి.

గత వారం మొత్తంమీద రూపాయి 67 పైసలు నష్టపోయింది. ఇదిలాఉండగా, భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ (క్యాడ్‌)పై క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుదల ప్రభావం పడే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ విశ్లేషించింది. 2018–19లో 2.4 శాతంగా క్యాడ్‌ నమోదుకావచ్చని అభిప్రాయపడింది. 

Advertisement
 
Advertisement
Advertisement