రూపాయి రికవరీ.. 72.18 వద్ద ముగింపు..

Rupee slips 10% vs US Dollar in 2018: Is India 'Fragile again? - Sakshi

ముంబై: కొత్త కనిష్ట స్థాయికి పడిపోతున్న రూపాయి బుధవారం కొంత కోలుకుంది. డాలర్‌తో దేశీ కరెన్సీ మారకం విలువ 51 పైసలు బలపడి 72.18 వద్ద ముగిసింది. రూపాయి మరీ   పడిపోకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ భరోసా కల్పించడం దీనికి తోడ్పడింది. మొదట్లో ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం కూడా 72.91 స్థాయికి పడిపోయి కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ వారాంతంలో ప్రధాని మోదీ ఆర్థిక వ్యవహారాల్ని సమీక్షిస్తారని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గర్గ్‌ ట్వీట్‌ చేయడం కొంత ఊతమిచ్చింది.

పతనాన్ని అడ్డుకుంటాం..: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ‘అసంబద్ధ స్థాయి’కి పడిపోకుండా ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ అన్ని చర్యలు తీసుకుంటాయని  గర్గ్‌ స్పష్టం చేశారు. రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్టానికి పతనం కావడం వెనుక హేతుబద్ధత లేదని, మార్కెట్‌ ఆపరేటర్ల ఓవర్‌రియాక్షన్‌ను ఇది ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. ట్విట్టర్‌లో ఈ మేరకు ఆయన పోస్ట్‌ చేశారు. క్రూడ్‌ ధరలు పెరుగుతుండటం, విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం తదితర అంశాల నడుమ రూపాయి క్షీణత కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top