వరుసగా ఐదో రోజూ లాభాల్లోనే

Rupee Gains 9 Paise Against Dollar in Early Trade    - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ కరెన్సీ రూపాయి పాజిటివ్‌గా మొదలైంది. ఇటీవల లాభాల్లో ఉన్న వరుసగా అయిదవ రోజు సోమవారం కూడా పుంజుకోవడం విశేషం.  డాలరు మారకంలో శుక్రవారం 14పైసలు లాభపడి 71.31వద‍్ద ముగిసింది.  ఈ రోజు  71.37వద్ద బలహీనంగా ప్రారంభమైనా వెంటనే పుంజుకుని  9 పైసలు ఎగిసి 71.22వద్ద  ఉంది.  డాలరులో పెరిగిన అమ్మకాలతో మన రూపాయికి బలమొచ్చిందని కరెన్సీ ట్రేడర్లు చెబుతున్నారు.   

మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు  బలహీనంగా ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌, 37వేలు, నిఫ్టీ 11వేల స్థాయిని కోల్పోయి నెగిటివ్‌ జోన్‌లోకి ఎంటరయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 163 పాయింట్లు క్షీణించి 36, 382వద్ద, నిఫ్టీ 61 పాయింట్ల నష్టంతో 10882 వద్ద కొనసాగుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top