జీవితకాల కనిష్టం నుంచి రికవరీ..!

Rupee Gains 38 Paise Against US Dollar - Sakshi

డాలర్‌ మారకంలో 33 పైసలు లాభపడిన రూపాయి

69.82 వద్ద ముగింపు  

ముంబై: డాలర్‌ మారకంలో గడచిన శుక్రవారం జీవితకాల కనిష్ట స్థాయిని తాకిన భారత కరెన్సీ రూపాయి... సోమవారం కొంత  లాభపడింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ సోమవారం 33 పైసలు బలపడి, 69.82 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ప్రారంభంతోనే లాభాల్లో 69.83 వద్ద మొదలయ్యింది. ఒక దశలో 69.59ని కూడా తాకింది.  డాలర్ల భారీ అమ్మకాలు, దేశీయ ఈక్విటీ మార్కెట్ల పరుగు వంటి అంశాలు దీనికి కారణం. శుక్రవారం రూపాయి 70.15 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఒక దశలో చరిత్రాత్మక కనిష్టం 70.40 స్థాయినీ చూసింది. ఏడు వారాల్లో రూపాయి భారీగా లాభప డటం సోమవారమే తొలిసారి. రూపాయి బలపడ్డానికి కీలక కారణాలు చూస్తే...

వాణిజ్య యుద్ధం ప్రభావం తగ్గించడానికి చైనా ప్రతినిధులు అమెరికాకు వస్తుండడం దేశీయ కరెన్సీపై సానుకూలత చూపింది.  
వాణిజ్యలోటు ఐదేళ్ల గరిష్ట స్థాయికి పెరిగినప్పటికీ, ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, చమురు ధరలు గరిష్ట స్థాయిల నుంచి కొంత తగ్గడం కలిసి వస్తోంది.  
చమురు ధరలు తగ్గడం, కార్పొరేట్‌ ఫలితాలు బాగుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌ క్యాపిటల్‌ మార్కెట్లలో 8,500 కోట్లు పంప్‌ చేశారు.  
♦  క్రాస్‌ కరెన్సీ ట్రేడింగ్‌లోనూ రూపాయి యూరో మారకంలో 70.80 నుంచి 79. 72 వద్దకు బలపడింది. జపాన్‌ యన్‌ విషయంలో 63.28 నుంచి 63.15కు చేరింది.  
♦   ఈ వార్త రాస్తున్న సమయం రాత్రి 8.30 గంటలకు అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్లో రూపాయి డాలర్‌ మారకంలో 0.11 శాతం నష్టంతో 69.87 వద్ద ట్రేడవుతుండగా, ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ స్వల్ప నష్టాల్లో 95.86 వద్ద ట్రేడవుతోంది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top