2020 నాటికి రూ.1,000 కోట్ల వ్యాపారం.. | Rs 1,000 crore business by 2020 .. | Sakshi
Sakshi News home page

2020 నాటికి రూ.1,000 కోట్ల వ్యాపారం..

Sep 12 2016 12:06 AM | Updated on Sep 4 2017 1:06 PM

2020 నాటికి రూ.1,000 కోట్ల వ్యాపారం..

2020 నాటికి రూ.1,000 కోట్ల వ్యాపారం..

బ్యాంకింగ్ రంగంలో ఉన్న అగ్రసేన్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 2020 నాటికి రూ.1,000 కోట్ల వ్యాపారం లక్ష్యంగా చేసుకుంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో ఉన్న అగ్రసేన్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 2020 నాటికి రూ.1,000 కోట్ల వ్యాపారం లక్ష్యంగా చేసుకుంది. 2015-16లో సంస్థ 23 శాతంపైగా వృద్ధితో రూ.508 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో నాలుగు శాఖలతో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ బ్యాంకు వచ్చే అయిదేళ్లలో మరో 12 శాఖలను తెరువనుంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని నగరాల్లో అడుగు పెడతామని బ్యాంకు చైర్మన్ ప్రమోద్ కుమార్ కేడియా తెలిపారు.

అగ్రసేన్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 18వ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా సీఈవో ఏ.కె.గోయల్‌తో కలసి ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేస్తామన్నారు. నికర నిరర్ధక ఆస్తులు 2.98 శాతం నుంచి 2.70కు తగ్గించినట్లు తెలిపారు. షెడ్యూల్డ్ బ్యాంక్ హోదాను రెండేళ్లలో దక్కించుకుంటామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలను విస్తరిస్తామని వెల్లడించారు. కాగా, 2015- 16 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.15 డివిడెండు చెల్లించేందుకు బోర్డు ప్రతిపాదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement