షేర్‌ హోల్డర్లకు రిలయన్స్‌ చాట్‌బోట్‌ సర్వీస్‌

RIL Launches First AI Chatbot To Assist Shareholders - Sakshi

న్యూఢిల్లీ : భారతీయ స్టాక్ మార్కెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతుంది. దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) తన షేర్‌ హోల్డర్ల కోసం శనివారం ఏఐ శక్తితో కూడిన చాట్‌బోట్‌ను ప్రారంభించింది. దీనిని జియో ప్లాట్‌ఫామ్‌ అనుబంధ సంస్థ హాప్టిక్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది.  ఇది భారతదేశ చరిత్రలో అతి పెద్దది. హిందీ, మరాఠీ, కన్నడ, గుజరాతీ, బంగ్లా వంటి భాషల్లో లభించనుంది. ఆర్‌ఐఎల్‌లో దాదాపు రూ. 53,125 కోట్ల రూపాయల హక్కులు కలిగిన తన షేర్‌ హోల్డర్లకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చాట్‌బోట్‌ ద్వారా సమాధానాలు ఇవ్వనుంది. ఇకపై షేర్‌ హోల్డర్స్‌ చాట్‌బోట్‌ సేవలను వాట్సప్‌ ద్వారా పొందవచ్చు.

చాట్‌బోట్‌ సర్వీస్‌ను వినియోగించాలంటే '7977111111' జియో నంబర్‌కు 'హాయ్' అని మెసేజ్‌ పంపగానే ఆటోమెటిక్‌గా యాక్టివ్‌ అవుతుంది. వాట్సప్‌లో వినియోగదారులు ఏంచుకునే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానమిచ్చేందుకు చాట్‌బోట్‌ ఎంతగానో ఉపయోగపడనుంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ సమయంలో షేర్‌ హోల్డర్ల ప్రశ్నలకు సమాధానాలందించేందుకు రిలయన్స్‌ బ్రోకర్లు, సబ్ బ్రోకర్లు, కాల్ సెంటర్లకు చాట్‌బాట్‌ విరివిగా సేవలు అందించనుంది. చాట్‌బోట్ ఎలా వినియోగించాలి.. చెల్లింపు పద్దతులు.. ఫారమ్‌లను ఎలా యాక్సెస్ చేయాలి.. లీడ్‌ మేనేజర్స్‌ను హెల్ప్‌లైన్‌ ద్వారా ఏ విధంగా సంప్రదించాలనే దానిపై రిలయన్స్‌ డాట్‌ కామ్‌లో తెలుసుకోవచ్చు. మనుషుల మాదిరిగానే చాట్‌బోట్‌ 24*7 తన సేవలను అందించనుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top