టాటా మెటార్స్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఫలితాల సెగ

Results effect Tata Motor, Jet Airwasy hits fresh 52-week low - Sakshi

సాక్షి, ముంబై: దేశీ ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌ కు ఫలితాల షాక్‌ తగిలింది.  ఈక్విటీ మార్కెట్లు సెంచరీ లాభాలతో ఊత్సాహకరంగా సాగుతుండగా, టాటా మోటార్స్‌  భారీగా నష్టాలను మూటగట్టుకుంటోంది. ముఖ్యంగా  గత  ఏడాది క్యూ4లో నికర లాభాలు 50శాతం క్షీణించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. భారీ అమ్మకాల ఒత్తిడితో  టాటా మోటార్స్‌ కౌంటర్‌  7శాతానికి పతనమై టాప్‌ లూజర్‌గా నిలిచింది. 52  వారాల కనిష్టం వద్ద ఉంది.  విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఫలితాల సెగ తాకింది.  ​6 శాతానికి పైగా పతనమైన జెట్‌ఎయిర్‌వేస్‌ షేరు 52 వారాల కనిష్టాన్ని తాకింది.

గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 50 శాతం క్షీణించి రూ. 2175 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం పెరిగి రూ. 91,279 కోట్లను తాకింది. ఇబిటా 4 శాతం పుంజుకుని 11,250 కోట్లకు చేరింది.  స్టాండెలోన్‌ ప్రాతిపదికన టాటా మోటార్స్‌ నికర నష్టం రూ. 806 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు తగ్గింది. అటు జెట్‌ ఎయిర్‌వేస​ స్టాండ్‌లోన్‌  ప్రాతిపదికన 1030కోట్ల  రూపాయల నష్టాన్నిప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 3.44 శాతం తగ్గి రూ.6,271 కోట్ల నుంచి రూ.6,055 కోట్లకు పరిమితమైంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top