వడ్డీ రేట్ల కోతకు చాన్స్ | Reserve Bank of India may cut interest rates as early as this week ... | Sakshi
Sakshi News home page

వడ్డీ రేట్ల కోతకు చాన్స్

Mar 3 2015 2:09 AM | Updated on Sep 2 2017 10:11 PM

వడ్డీ రేట్ల కోతకు చాన్స్

వడ్డీ రేట్ల కోతకు చాన్స్

బడ్జెట్‌లో తీసుకున్న చర్యలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో బ్యాంకింగ్‌కు...

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో తీసుకున్న చర్యలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో బ్యాంకింగ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రేట్ల కోత సంకేతాలకు అవకాశాలు మరింత సుస్పష్టమయినట్లు పలు విశ్లేషణా సంస్థలు, నిపుణులు అంచనావేస్తున్నారు. వీరి అంచనాలను ఒక్కసారి పరిశీలిస్తే...

ప్రస్తుతం ద్రవ్యోల్బణం అత్యంత దిగువ స్థాయిలో ఉంది. బడ్జెట్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన పలు చర్యలు ఈ ధోరణికి ఎటువంటి విఘాతం కలిగించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈ వారంలోనే ఎప్పుడైనా రెపో రేటు(బ్యాంకులకు ఇచ్చే  స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు-ప్రస్తుతం 8%)ను కొంత తగ్గించే వీలుంది. 2015 ముగింపు నాటికి ఆర్‌బీఐ రెపో రేటును 1.25% తగ్గించే అవకాశం ఉంది. ఇక బడ్జెట్ వ్యవహారం పూర్తయిపోయినందున, కీలక పాలసీ సంస్కరణల కోసం ఇన్వెస్టర్లు దృష్టి పెడతారు.
 - చేతన్, మోర్గాన్ స్టాన్లీ ఆసియా ఎకనమిస్ట్
 
మీప భవిష్యత్తులో అర శాతం మేర వడ్డీ రేట్ల కోతకు అవకాశం ఉందన్న మా అంచనాలకు కట్టుబడి ఉన్నాం. ఇందులో మొదటి విడత తగ్గింపు ఏప్రిల్ ఆర్‌బీఐ సమీక్షా సమావేశంలో చోటుచేసుకునే అవకాశం ఉంది.                       - భండారీ, హెచ్‌ఎస్‌బీసీ చీఫ్ ఇండియన్ ఎకనమిస్ట్
 
ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడికి కట్టుబడి ఉన్నట్లు బడ్జెట్ సూచించింది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 7వ తేదీ (తదుపరి పాలసీ సమీక్ష తేదీ),  జూన్‌లో కూడా ఆర్‌బీఐ పావుశాతం చొప్పున రేట్ల కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
 - బ్యాంక్ ఆఫ్ అమెరికా మిరిల్ లించ్
 
జూన్ నాటికి అరశాతం రేట్ల కోత ఉంటుందన్న మా అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదు.
 - డీబీఎస్ బ్యాంక్

వృద్ధికి ప్రోత్సాహం దిశగా ఏప్రిల్ 7న పాలసీ రేటును పావు శాతం తగ్గించే అవకాశాలు ఉన్నాయి. సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 - నోమురా

Advertisement
 
Advertisement
Advertisement