రిలయన్స్‌ రిటైల్‌: ఆన్‌లైన్‌ దిగ్గజాలకు గుబులే | Reliance Retail Set to Disrupt Amazon Walmart-Flipkart Forrester | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ రిటైల్‌: ఆన్‌లైన్‌ దిగ్గజాలకు గుబులే

May 22 2019 11:53 AM | Updated on May 22 2019 12:26 PM

Reliance Retail Set to Disrupt Amazon Walmart-Flipkart Forrester - Sakshi

సాక్షి, ముంబై : వ్యాపార రంగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న ప్రముఖ బిలియనీర్ ముకేశ్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ రీటైల్ ఆన్‌లైన్‌ మార్కెట్లో కూడా సంచలనాలను నమోదు చేయనుంది. తద్వారా అమెజాన్‌, వాల్‌మార్ట్‌- ఫ్లిప్‌కార్ట్‌లకు పెద్ద సవాల్‌గా మారనుంది. జియో తరహాలోనే మార్కెట్లో విధ్వంసకర డిస్కౌంట్లకు తెరతీయనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ప్రపంచ మార్కెట్ పరిశోధనా సంస్థ ఫోర్రెస్టర్ ప్రకారం 2023 నాటికి భారతదేశంలో ఆన్‌లైన్‌ రిటైల్ విక్రయాల మార్కెట్ విలువ 85 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 5,90,000 కోట్లు) చేరనుంది. వచ్చే ఐదేళ్లలో ఆన్‌లైన్ రిటైల్ సేల్స్ 25.8 శాతం వృద్ధిని సాధించనున్నాయి. అలాగే  భారత్‌లో 2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ అమలు, గత డిసెంబర్‌లో ఈ కామర్స్ పాలసీలో మార్పుల రూపంలో ఒడిదుడుకులు ఎదురైనా వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. 

6,600 నగరాలు, పట్టణాల్లో 10,415 స్టోర్లు కలిగిన రిలయన్స్ రిటైల్ ఏటా 500మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీ డిస్కౌంట్లతో ముందుకొచ్చే రిలయన్స్ స్టోర్లకు ఆదరణ పెరుగుతుందని ఫోర్రెస్టర్ అంచనా వేస్తోంది. ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్లకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని విశ్లేషించింది. అలాగే భారీ డిస్కౌంట్లతో రిలయన్స్ రిటైల్ మార్కెట్‌లోఅడుగు పెడితే ఆన్‌లైన్‌ రీటైల్‌ దిగ్గజాలకు నష్టాలు తప్పవని, దాదాపు టెలికాం మార్కెట్‌లోకి జియో  ప్రవేశించిన అనంతరం ఏర్పడిన పరిస్థితులే పునరావృతం అవుతాయని ఫోర్రెస్టర్ సీనియర్ ఫోర్‌కాస్ట్ అనలిస్ట్ సతీష్ మీనా అభిప్రాయపడ్డారు.

2019 ఏప్రిల్‌లో రిలయన్స్ తన ఎంప్లాయిస్ కోసం ఫుడ్ అండ్ గ్రోసరీ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ ఏడాదిలోనే యాప్‌ను కమర్షియల్‌గా లాంచ్‌ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తద్వారా రిలయన్స్ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ టూ ఆఫ్ లైన్ కామర్స్ ప్లాట్‌ఫాంను అందుబాటులో తేవడంతోపాటు, వినియోగదారులకు భారీ ప్రయోజనాలను అందించనుంది. 

 కాగా 2019 ఆర్థిక  సంవత్సరంలో రిలయన్స్‌ రీటైల్‌ ఆదాయం 81 బిలియన్‌ డాలర్లుగానూ, లాభాలు 9.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అలాగే రూ. 620 కోట్ల భారీ పెట్టుబడితో  ఇటీవల సొంతం చేసుకున్న  గ్లోబల్‌​ టాయ్స్‌ కంపెనీ హామ్లీస్‌తోపాటు 40 బ్రాండ్లు రిలయన్స్ పోర్ట్‌ఫోలియోలో భాగం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement