జియో ఫెస్టివ్‌ గిఫ్ట్‌కార్డ్‌ బొనాంజా | Reliance Jio Phone Along with Free Voice and Internet Data | Sakshi
Sakshi News home page

జియో ఫెస్టివ్‌ గిఫ్ట్‌కార్డ్‌ బొనాంజా

Jan 3 2019 11:39 AM | Updated on Jan 3 2019 3:19 PM

Reliance Jio Phone Along with Free Voice and Internet Data  - Sakshi

రిలయన్స్‌ జియో కస్టమర్లకోసం హ్యాపీ న్యూయర్‌ బొనాంజా ఆఫర్లు కొనసాగుతున్నాయి. తాజాగా ఫెస్టివ్‌ గిఫ్ట్‌ కార్డ్‌ ఆఫర్‌ను జియో  ప్రకటించింది. దీని ద్వారా జియో  యూజర్లు  జియో కొత్త ఫోన్‌తోపాటు, ఆరు నెలలపాటు ఉచిత వాయిస్‌, డేటా సర్వీసులను పొందవచ్చు. 

జియో ఫెస్టివ్‌ గిఫ్ట్‌కార్డ్‌  విలువ రూ.1095. ఈ మొత్తం  రెండు భాగాలుగా విభజించపడతాయి.  రూ. 501, రూ. 594 విలువైన  కూపన్లు లభిస్తాయి.  రూ.501తో  జియో ఫీచర్‌ ఫోన్‌తో పాటు నెలకు రూ.99 విలువైన కూపన్లు  ఆరు నెలలకు అన్నమాట. గిఫ్ట్‌కార్డు కొనుగోలు చేసిన కస్టమర్‌ దగ్గరలోని జియో స్టోర్‌లోగానీ, రిలయన్స్‌ డిజిటల్‌లోగాని పాత జియో ఫోన్‌ ఎక్స్చేంజ్‌  ద్వారా కొత్త  జియో ఫోన్‌ 2 కోనుగోలు చేయవవచ్చు.

మరోవైపు  నేడు ( గురువారం, జనవరి 3)   మధ్యాహ్నం 12 గంటలనుంచి జియో ఫీచర్‌ ఫోన్‌ -2 ఫ్లాష్‌ సేల్‌  కూడా  ఉంది.  ధర. 2,999

జియో ఫోన్ 2  ఫీచర్లు
2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే
512 ర్యామ్
4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా
వీజీఏ ఫ్రంట్ కెమెరా
2000 ఎంఏహెచ్ బ్యాటరీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement