భారీ పెట్టుబడులు, భారీ ఉద్యోగాలు-అంబానీ

Reliance to invest Rs 2,500 crore in Assam, create 80,000 - Sakshi

సాక్షి, గువహటి: రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ అసోం రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు.  రాబోయే మూడేళ్లలో  వివిధ రంగాల్లో  భారీగా పెట్టుబడులు పెట్టునున్నామని  శనివారం   ప్రకటించారు. తద్వారా రాష్ట్రంలో  పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని వెల్లడించారు. అంతేకాదు మిగతా అన్ని టెలికాం మార్కెట్లకు  అసోం ఎప్పుడూ  తక్కువ ప్రాధాన్యత  మార్కెట్‌గా ఉంది..కానీ రిలయన్స్‌ జియోకు  మాత్రం  కేటగిరి ‘ఎ’ గా ఉందన్నారు.  ఈ నేపథ్యంలో ఉపాధి అవకాశాలను 5రెట్లు పెంచి నిలకడైన జీవనోపాధి అవకాశాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అసోంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2018 ప్రారంభోత్సవం సందర్భంగా   అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు.  

పెట్రోలియం, టెలికాం, పర్యాటక రంగం, స్పోర్ట్స్ వంటి వివిధ రంగాల్లో రూ. 2,500 కోట్ల అదనపు పెట్టుబడులు  పెట్టనున్నామని అంబానీ ప్రకటించారు.  తద్వారా రానున్న మూడేళ్లలో కనీసం 80,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని ఆయన వివరించారు.  ఇందుకోసం ప్రస్తుతం వున్న తమ రీటైల్‌ ఔట్‌లెట్లను 40కి పెంచుతామనీ, అలాగే  పెట్రోల్‌ డిపోలను 27నుంచి 165కు పెంచుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో  145 కార్యాలయాలను  ఏర్పాటు చేయనున్నామన్నారు. భారీ ఉపాధి కల‍్పనపైనే తాము దృష్టిపెట్టిన తాము ఇప్పటికే 20వేల ఉద్యోగాలను  కల్పించామని చెప్పారు. పర్యాటక రంగంలో, సంస్థకు చెందిన సీఎస్‌ఆర్‌ విభాగం  రిలయన్స్ ఫౌండేషన్  ప్రభుత్వ భాగస్వామ్యంతో వన్యప్రాణుల రక్షణ, ఎకో టూరిజం ప్రోత్సాహానికి గాను ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.  దీంతోపాటు అసోం ప్రభుత్వంతో కలిసి ఒక  అగ్రశ్రేణి ఫుట్‌బాల్‌ అకాడమీని స్థాపించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అంబానీ ప్రశంసల వర్షం కురిపించారు. రైతులతో సహా సమాజంలోని అన్ని వర్గాలపై దృష్టి పెట్టి ఇటీవలి కాలంలో ఉత్తమ బడ్జెట్‌ అందించారని  ప్రశంసించారు. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ కోసం తపన పడుతున్న పాపులర్‌ ప్రధాని నాయకత్వంలో  దేశంలో  సరైన సమయంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్  ఇతర  దేశాలను కూడా ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. అలాగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2018 ఏర్పాటు చేసినందుకు అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌నుకూడా అంబానీ అభినందించారు.  అసోం రాష్ట్ర అభివృద్ధి బ‍్రహ్మాండంగా ఉందనీ,  ముఖ్యంగా జాతీయ సగటు కంటే దాని తలసరి ఆదాయం మెరుగ్గా ఉందని పేర్నొన్నారు. రూ. 5వేలకోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో అతిపెద్ద ప్రైవేటురంగ  పెట్టుబడిదారుగా రిలయన్స్‌ అవతరించిదని  అంబానీ వెల్లడించారు.  ప్రస్తుతం అసోంలో జియో  వినియోగారుల సంఖ్య  30లక్షలుగా ఉందని, రాబోయే నెలల్లో దీన్ని మరింత  పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top