
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా నగదు నిల్వలు సమకూరుతాయని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేసింది. 4,000 కోట్ల డాలర్ల ప్రాజెక్ట్‌లు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయని, దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు భారీగా నగదు నిల్వలు లభిస్తాయని తన తాజా నివేదికలో సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ఇటీవలే ప్రారంభమైన రిఫైనరీ ఆఫ్–గ్యాస్ క్రాకర్,(ఆర్‌ఓజీసీ) త్వరలో ప్రారంభం కానున్న పెట్‌కోక్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్‌ల వల్ల ఇబిటా మరింత జోరుగా పెరుగుతుందని సంస్థ తెలిపింది.