విదేశీ పెట్టుబడులకు రెడ్‌ కార్పెట్‌

Red Carpet for Foreign Investments In INDIA - Sakshi

ఆకర్షించేందుకు అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు

క్యాబినెట్‌ కార్యదర్శి నేతృత్వం

మంత్రిత్వశాఖల్లో పీడీసీల ఏర్పాటుకూ నిర్ణయం

కేంద్రం కీలక నిర్ణయాలు  

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కల్లోలంతో  ఏర్పడిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు అంతర్జాతీయ పెట్టుబడులను ఎలా ఆకర్షించాలన్న అంశంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు చైనా నుంచి పెట్టుబడులను తరలిస్తున్నాయని, ఇన్వెస్ట్‌మెంట్‌ విధానాలను పునర్‌వ్యవస్థీకరించుకుంటున్నాయని వస్తున్న వార్తలు తాజా నిర్ణయాలకు నేపథ్యం. వాణిజ్య శాఖ ప్రకటన ప్రకారం క్యాబినెట్‌ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలివీ...

► సెక్రటరీలతో కూడిన ఒక ఉన్నత స్థాయి సాధికార గ్రూప్‌ (ఈజీవోఎస్‌) ఏర్పాటు. దీనికి క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వం వహిస్తారు.

► మంత్రిత్వశాఖలు, డిపార్ట్‌మెంట్‌లలో ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ విభాగాలు (పీడీసీ)లు ఏర్పాటవుతాయి. పెట్టుబడుల ప్రతిపాదనల అమలు దిశలో ఉన్న అడ్డంకులను తొలగించి ఆయా అంశాలను సాధికార గ్రూప్‌ ముందు ఉంచుతాయి.  

► ఉన్నతస్థాయి సాధికార గ్రూప్‌లో నీతి ఆయోగ్‌ సీఈఓ, డీపీఐఐటీ (డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌), వాణిజ్యం, రెవెన్యూ, ఆర్థిక శాఖల కార్యదర్శులు, ఆయా డిపార్ట్‌మెంట్‌ల చీఫ్‌లు సభ్యులుగా ఉంటారు. క్యాబినెట్‌ సెక్రటరీ చైర్‌పర్సన్‌గా ఉంటే, డీపీఐఐటీ సెక్రటరీ మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.  

► పెట్టుబడుల ఆకర్షణకు విధానాలు, వ్యూహాల రూపకల్పన, ఆయా ప్రాజెక్టులకు సంబంధించి విభిన్న మంత్రిత్వశాఖలు, డిపార్ట్‌మెంట్‌ల నుంచి సత్వర, సకాల ఆమోదాలు వచ్చేట్లు చూడ్డం, గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్లకు తగిన ఇన్‌ఫ్రా ఏర్పాటు సాధికార గ్రూప్‌ ప్రధాన విధానాలు.

► వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులు, నిర్వహణ విషయంలో  కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, సహకారం నెలకొల్పడం ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ సెల్స్‌ (పీడీసీ) ఏర్పాటు ప్రధాన లక్ష్యం. ఒక మంత్రిత్వశాఖలో జాయింట్‌ సెక్రటరీ స్థాయి అధికారి పీడీసీ ఇన్‌చార్జ్‌గా ఉంటారు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ వచ్చేలా చూడ్డం, భూ లభ్యత సమస్యల పరిష్కారం, ఆయా అంశాలను ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సాధికార కమిటీ దృష్టికి తీసుకువెళ్లడం పీసీడీ విధివిధానాలు.  

పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం
భారత్‌లో పెట్టుబడులకు మరింత స్నేహపూర్వక వాతావరణం సృష్టించడానికి తాజా నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని వాణిజ్యశాఖ  పేర్కొంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ మిషన్‌ను మరింత పటిష్టం చేస్తుందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి వివిధ రంగాల్లో ప్రత్యక్షంగా,  పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెంచే దిశలో ఈ నిర్ణయం కీలకమైనదని విశ్లేషించింది. 2024–25 నాటికి  5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించడానికి ఇది ఒక కొత్త యంత్రాంగమనీ అభివర్ణించింది. కరోనా వల్ల అంతర్జాతీయంగా పలు కంపెనీలు తమ పెట్టుబడుల వ్యూహాలను పునర్‌వ్యవస్థీకరించుకునే పనిలో ఉన్నాయని సూచించింది.

► డిఫాల్టర్లకు ఊరట...
ఐబీసీ సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం
ఇన్‌సాల్వెన్సీ, దివాలా కోడ్‌ (ఐబీసీ) సవరణకు వీలుగా ఒక కీలక ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. కోవిడ్‌–19 మహమ్మారి కష్టనష్టాల నేపథ్యంలో బకాయిలు చెల్లించలేని వారిపై ఎటువంటి ఇన్‌సాల్వెన్సీ చర్యలు తీసుకోకుండా వీలుకల్పిస్తూ ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేసినట్లు ఉన్నత స్థాయి వర్గాల సమాచారం. లాక్‌డౌన్‌ విధించిన మార్చి 25 తర్వాత పరిస్థితుల నేపథ్యంలో మొండిబకాయిల (ఎన్‌పీఏ)పై ఐబీసీ ప్రొసీడింగ్స్‌ను చేపట్టకుండా ఆర్డినెన్స్‌ తగిన రక్షణను కల్పిస్తుంది. ఇందుకు అనుగుణంగా కోడ్‌లోని 7, 9, 10 సెక్షన్లను సస్పెండ్‌ చేసినట్లు, సెక్షన్‌ 10ఏను కొత్తగా ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆరు నెలల పాటు డిఫాల్టర్లపై తాజాగా ఎటువంటి దివాలా ప్రొసీడింగ్స్‌ను చేపట్టడం సాధ్యం కాదు. ఏడాది పాటు దీనిని పొడిగించడానికి సైతం ఆర్డినెన్స్‌ వీలు కల్పిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

07-07-2020
Jul 07, 2020, 07:58 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కేవలం నగదు చెల్లించే కొన్ని వర్గాలకు మాత్రమేనని, ఆ...
07-07-2020
Jul 07, 2020, 07:47 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అనుమతించిన ప్రైవేటు లేబొరేటరీ లు, వివిధ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని...
07-07-2020
Jul 07, 2020, 07:36 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితుల్లో రోగనిరోధకశక్తి తగ్గుతున్న క్రమంలో శరీరంలో ఉండే బ్యాక్టీరియాలు కరోనా వైరస్‌కు సహకరిస్తున్నాయని ఐసీఎంఆర్‌ (ఇండియన్‌...
07-07-2020
Jul 07, 2020, 07:06 IST
సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య కరోనా విభేదాలు సృష్టించింది. కోవిడ్‌ బాధితులకు అందుతున్న వైద్యం తీరుతెన్నులపై చర్చించేందుకు...
07-07-2020
Jul 07, 2020, 05:35 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాల నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, క్రమంగా లాక్‌డౌన్‌ ఎత్తివేయడం వంటి...
07-07-2020
Jul 07, 2020, 03:56 IST
న్యూయార్క్‌: కరోనా వైరస్‌ గాలి ద్వారా ఇతరులకు సోకుతుందనేందుకు ఆధారాలున్నాయని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ...
07-07-2020
Jul 07, 2020, 03:40 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ విసిరిన పంజాకు గ్రేటర్‌లో కార్యకలా పాలు సాగిస్తున్న పలు ఐటీ, బీపీఓ కంపెనీలు లక్షలాది మంది...
07-07-2020
Jul 07, 2020, 03:29 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో పాలన వ్యవహారాల్లో భౌతికంగా మానవ ప్రమేయాన్ని సాధ్యమైనంతగా తగ్గించేందుకు రాష్ట్ర...
07-07-2020
Jul 07, 2020, 02:47 IST
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల విషయంలో రష్యాను దాటేసి, ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది....
07-07-2020
Jul 07, 2020, 02:24 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటికే ప్రతిరోజూ 1,800 వరకు కేసులు రికార్డు అవుతున్నాయి. ఈ...
07-07-2020
Jul 07, 2020, 02:18 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 300 దాటింది. సోమవారం కరోనాతో 11 మంది మృత్యువాతపడగా.. మొత్తం...
07-07-2020
Jul 07, 2020, 02:11 IST
సాక్షి, హైదరాబాద్‌: పీజీ, డిగ్రీలు చేసి చిన్నాచితకా ఉద్యో గాలతో నెట్టుకొస్తున్న లక్షలాది మంది మధ్య తరగతి కుటుంబాల యువతను...
06-07-2020
Jul 06, 2020, 19:59 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఓ జర్నలిస్ట్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఢిల్లీలో ఓ ప్రముఖ దినపత్రికలో విధులు నిర్వర్తిస్తున్న...
06-07-2020
Jul 06, 2020, 18:39 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రపంచ బ్యాంకు...
06-07-2020
Jul 06, 2020, 18:36 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఒక్క ఫోన్‌ కాల్‌ ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. అర్థరాత్రి వేళ, తనను కాపాడాలంటూ ఓ వ్యక్తి...
06-07-2020
Jul 06, 2020, 17:44 IST
ఇంపాల్‌: కరోనా వచ్చిన నాటి నుంచి మన జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. బంధువులు లేరు.. వేడుకలు లేవు. ఎక్కడికైనా...
06-07-2020
Jul 06, 2020, 17:35 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప‍్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ  దేశీయ ఫార్మా సంస్థ  మైలాన్‌ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ...
06-07-2020
Jul 06, 2020, 16:58 IST
ప్రతి ఆదివారం కర్ఫ్యూ మాత్రం ఉంటుందన్నారు
06-07-2020
Jul 06, 2020, 16:39 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతుండటంతో కరోనా పరీక్షల సామర్థ్యం భారీగా పెరిగింది. ఇప్పటి వరకు దేశంలో కోటి కరోనా నిర్ధారణ...
06-07-2020
Jul 06, 2020, 16:18 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మరో 1,263 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top