అందరి చూపు రిజర్వు బ్యాంక్ నిర్ణయం పైనే!
ద్రవ్యోల్పణం నియంత్రించేందుకు రిజర్వు బ్యాంకు తీసుకోబోయే నిర్ణయంపై వ్యాపార, మధ్య తరగతి ప్రజల్లో ఆసక్తి రేపుతోంది.
ముంబై: ద్రవ్యోల్పణం నియంత్రించేందుకు రిజర్వు బ్యాంకు తీసుకోబోయే నిర్ణయంపై వ్యాపార, మధ్య తరగతి ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. మంగళవారం ద్యవ పరపతి విధాన సమీక్షలో భాగంగా కీలక వడ్డీ రేట్లపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అందరూ ఎదురు చూస్తున్నారు. ఆహార ద్రవ్యోల్పణం 8 శాతానికి మించి ఉండటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.
అయితే ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయడానికి రఘురాం రాజన్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేపట్టకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రుతు పవనాలు లేకపోవడంతో ఆహార పదార్ధాల ధరలు..ముఖ్యంగా కేజీ టమాటో ధర 80 రూపాయలకు చేరుకోవడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.. కావున వడ్డీ రేట్లలో ఏలాంటి మార్పులుండకపోవచ్చని కొటాక్ సెక్యూరిటీస్ అధినేత దిపేన్ సింగ్ అభిప్రాయపడ్డారు.