♦ పారిశ్రామిక ఉత్పత్తి మందగమనం..
♦ మేలో కేవలం 1.7 శాతం వృద్ధి
♦ చరిత్రాత్మక కనిష్టంలో రిటైల్ ధరల స్పీడ్
♦ జూన్‌లో 1.54 శాతం
♦ ఆగస్టు ఆర్‌బీఐ పాలసీపై దృష్టి
ముంబై: రెపో, రివర్స్ రెపో వంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేట్లను మరింత తగ్గించాలన్న డిమాండ్‌కు బలం చేకూరే స్థూల ఆర్థిక గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీ మే నెలలో కేవలం 1.7 శాతం (2016 ఇదే నెలతో ఉత్పత్తితో పోల్చితే) నమోదయ్యింది. ఇక జూన్‌లో వినియోగ ధరల (సీపీఐ) సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం చరిత్రాత్మక కనిష్ట స్థాయి 1.54 శాతంగా నమోదయ్యింది. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉన్న నేపథ్యంలో అటు ప్రభుత్వం నుంచీ ఇటు పారిశ్రామిక వర్గాల నుంచీ రేటు తగ్గింపునకు ఆర్‌బీఐకి విజ్ఞప్తులు అందుతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం నేపథ్యంలో బుధవారం ఆయా శాఖలు విడుదల చేసిన గణాంకాల వివరాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ఐఐపీ... 8 నుంచి 1.7 శాతానికి డౌన్
⇔ 2016 మే నెలలో (2015 మే నెలతో పోల్చితే) పారిశ్రామిక ఉత్పత్తి 8%గా నమోదయ్యింది. అయితే తాజా దిగువ ధోరణికి కారణం– కీలకమైన తయారీ, మైనింగ్ వంటి విభాగాల పేలవ పనితీరే.
⇔ మొత్తం సూచీలో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగంలో వృద్ధి రేటు 8.6 శాతం నుంచి 1.2 శాతానికి పడిపోయింది.
⇔ భారీ వస్తు ఉత్పత్తికి, డిమాండ్, పెట్టుబడులకు సూచిక అయిన క్యాపిటల్ గూడ్స్‌లో అసలు వృద్ధిలేకపోగా – 3.9% క్షీణత నమోదయ్యింది. 2016 మే నెలలో ఈ విభాగంలో వృద్ధి భారీగా 13.9%.
⇔ కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలోనూ క్షీణత నమోదయ్యింది.
⇔ మైనింగ్ రంగం 5.7% క్షీణత నుంచి 0.9% క్షీణతకు జారింది.
⇔ విద్యుత్ రంగంలో ఉత్పాదకత వృద్ధి మాత్రం 6.1 శాతం నుంచి 8.7 శాతానికి ఎగసింది.
ఏప్రిల్–మే నెలల్లోనూ దిగువకే...
2016 ఏప్రిల్–మే నెలల్లో ఐఐపీ 7.3 శాతం నుంచి 2.3 శాతానికి పడిపోయింది. ఈ కాలంలో తయారీ రంగం వృద్ధి రేటు 7.1 శాతం నుంచి 1.8 శాతానికి, మైనింగ్ రంగానికి సంబంధించి ఈ శాతం 6.2 శాతం నుంచి 1.1 శాతానికి, విద్యుత్ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు 10.1 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గింది.
తగ్గిన రిటైల్ ‘ధర’ వేగం
⇔ 2016 జూన్ నెలతో పోల్చితే 2017 జూన్‌లో రిటైల్ ధరల పెరుగుదల వేగం గణనీయంగా తగ్గిపోయింది. చరిత్రాత్మక కనిష్ట స్థాయిలో 1.54 శాతంగా నమోదయ్యింది.
⇔ ఆహార ఉత్పత్తులు: కూరగాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా ధరలు 17% తగ్గాయి. పప్పులు, సంబంధిత ప్రొడక్టుల ధరలు కూడా 22% తగ్గాయి. గుడ్లు (–0.08%), సుగంధ ద్రవ్యాలది(–0.73%) కూడా ఇదే పరిస్థితి. తృణధాన్యాలు (4.39%), మాంసం, చేపలు (3.49%), పాలు, పాలపదార్థాలు (4.15%), చమురు, వెన్న (2.34 శాతం), పండ్లు (1.98%) ధరలు స్వల్పంగా పెరగ్గా, చక్కెర సంబంధిత ఉత్పత్తుల ధర 8.74% ఎగశాయి.
⇔ పాన్, పొగాకు: ఈ విభాగంలో ధరలు 5.62 శాతం పెరిగింది.
⇔ దుస్తులు, పాదరక్షలు: ధరల పెరుగుదల 4.17 శాతం.
⇔ హౌసింగ్: ధరల పెరుగుదల రేటు 4.7 శాతం.
⇔ ఫ్యూయెల్, లైట్: 4.54 శాతం ఎగసింది.
స్థిరత్వానికి సంకేతం
రిటైల్ ద్రవ్యోల్బణం స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వానికి సంకేతం. ఈ తరహా గణాంకాలు మనం 1999లో అంతకుముందు 1978 ఆగస్టుల్లోనే చూశాం. – అరవింద్ సుబ్రమణ్యం, ప్రధాన ఆర్థిక సలహాదారు
రేట్ల కోతకు ‘సానుకూల’ అంకెలు
Published Thu, Jul 13 2017 1:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్‌కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement