రూ.1000 కంటే ఎక్కువ ఇవ్వొద్దు : ఆర్‌బీఐ

RBI Instructs Restrict withdrawals to Rs 1000 Per Account - Sakshi

సాక్షి, ముంబై : కరెన్సీ కొరత నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రంగంలోకి దిగింది. విత్‌ డ్రాల కోసం ఖాతాదారులు బ్యాంకులను ఆశ్రయిస్తున్న తరుణంలో.. పరిమితి విధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రూ.1000 కంటే మించి ఖాతాదారులకు ఇవ్వొద్దని ముంబైకి చెందిన సిటీ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌కు ఆదేశాలు జారీ చేసింది. వీటిని మరిన్ని బ్యాంకులకు విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. (ఖాతాదారులకు ఆర్‌బీఐ హెచ్చరిక)

‘సేవింగ్‌.. కరెంట్‌.. ఏ తరహా అకౌంట్‌ అయినా సరే రూ.1000 కి మించి ఇవ్వొద్దు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆదేశాలు పాటించాలి’ అని ఆదేశాల కాపీలో బ్యాంక్‌కు ఆర్‌బీఐ తెలిపింది. మరోపక్క లోన్‌లు, అడ్వాన్స్‌ విషయంలో కూడా ఆర్బీఐ నుంచి అనుమతి లేనిదే లోన్లు, అడ్వాన్లు.. జారీ చేయటానికి వీల్లేదని ఆర్‌బీఐ పేర్కొంది. అయితే ఈ పరిస్థితులు తాత్కాలికమేనని.. త్వరలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆర్‌బీఐ అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరోవైపు బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌(పీఓఎస్‌) మిషన్ల ద్వారా రోజుకు రూ.2000 వరకు నగదును కస్టమర్లు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top