‘రైల్యాత్రి’ స్టార్టప్లోకి మరిన్ని నిధులు | RailYatri raises funds from existing investors | Sakshi
Sakshi News home page

‘రైల్యాత్రి’ స్టార్టప్లోకి మరిన్ని నిధులు

Oct 20 2016 1:19 AM | Updated on Sep 4 2017 5:42 PM

‘రైల్యాత్రి’ స్టార్టప్లోకి మరిన్ని నిధులు

‘రైల్యాత్రి’ స్టార్టప్లోకి మరిన్ని నిధులు

రైల్వే ప్రయాణానికి సంబంధించిన కన్సూమర్ యాప్ స్టార్టప్, రైల్‌యాత్రిడాట్‌ఇన్.. ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచి తాజాగా నిధులు సమీకరించింది.

ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచే సమీకరణ
ముంబై: రైల్వే ప్రయాణానికి సంబంధించిన కన్సూమర్ యాప్ స్టార్టప్, రైల్‌యాత్రిడాట్‌ఇన్.. ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచి తాజాగా నిధులు సమీకరించింది. ప్రస్తుత ఇన్వెస్టర్లు-నందన్ నీలేకని, హిలియన్ వెంచర్స్, ఒమిడ్యార్ పార్ట్‌నర్స్, బ్లూమ్ వెంచర్స్ నుంచి తాజాగా పెట్టుబడులు సమీకరించామని రైల్‌యాత్రిడాట్‌ఇన్ తెలిపింది. అయితే ఎన్ని పెట్టుబడులు వచ్చింది వంటి ఆర్థిక వివరాలను ఈ సంస్థ వెల్లడించలేదు.

ఈ ఏడాది మార్చి తర్వాత ఇదే మరో దఫా పెట్టుబడుల సమీకరణ అని రైల్‌యాత్రిడాట్‌ఇన్ సీఈఓ, వ్యవస్థాపకుల్లో ఒకరైన మనీశ్ రాఠి తెలిపారు.  ఈ యాప్... ప్రయాణికుడి మొబైల్ జీపీఎస్‌ను వినియోగించుకొని ఒక రైలు ఎంత ఆలస్యంగా వచ్చేది అంచనా వేస్తుంది. అంతేకాకుండా రైలు  ఏ ప్లాట్‌ఫార్మ్ మీదకు వస్తుంది, కోచ్ పొజిషన్, ట్రైన్ ఆన్ టైమ్ హిస్టరీ, వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మేషన్స్ వివరాలతో పాటు మంచి నాణ్యత గల భోజనం అందించే ఏర్పాట్లు, బస్ టికెట్లు, బడ్జెట్ రూమ్స్ బుకింగ్ తదితర సేవలనూ అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement