భారత మార్కెట్లోకి పీఎస్‌ఏ గ్రూప్‌ మళ్లీ ఎంట్రీ | PSA Group, CK Birla sign agreement to make cars in Tamil Nadu | Sakshi
Sakshi News home page

భారత మార్కెట్లోకి పీఎస్‌ఏ గ్రూప్‌ మళ్లీ ఎంట్రీ

Jan 26 2017 1:36 AM | Updated on Sep 5 2017 2:06 AM

భారత మార్కెట్లోకి పీఎస్‌ఏ గ్రూప్‌ మళ్లీ ఎంట్రీ

భారత మార్కెట్లోకి పీఎస్‌ఏ గ్రూప్‌ మళ్లీ ఎంట్రీ

యూరప్‌నకు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం పీఎస్‌ఏగ్రూప్‌ మరోసారి భారత మార్కెట్లో ప్రవేశించింది. ఈసారి సీకే బిర్లా గ్రూప్‌తో చేతులు కలిపింది.

న్యూఢిల్లీ: యూరప్‌నకు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం పీఎస్‌ఏగ్రూప్‌ మరోసారి భారత మార్కెట్లో ప్రవేశించింది. ఈసారి సీకే బిర్లా గ్రూప్‌తో చేతులు కలిపింది. తమిళనాడులో వాహనాలు, పవర్‌ట్రెయిన్స్‌ తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం పీఎస్‌ఏ గ్రూప్‌ ప్రాథమికంగా వంద మిలియన్‌ యూరోలు (దాదాపు రూ. 700 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనుంది. ఇందుకోసం రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. మొదటిదాని ప్రకారం.. తమ ప్యాసింజర్‌ వాహనాల అసెంబ్లింగ్, పంపిణీ కోసం హిందుస్తాన్‌ మోటార్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఎంఎఫ్‌సీఎల్‌)తో పీఎస్‌ఏ గ్రూప్‌ జాయింట్‌ వెంచర్‌ సంస్థను ఏర్పాటు చేయనుంది.

దీనిలో పీఎస్‌ఏ గ్రూప్‌నకు మెజారిటీ వాటాలు ఉంటాయి. ప్రాథమికంగా ఏటా 1,00,000 వాహనాల తయారీ సామర్ధ్యంతో ప్లాంటు ఏర్పాటు కానుంది.  ఇక పవర్‌ట్రెయిన్స్‌ తయారీ, సరఫరా కోసం చెరి యాభై శాతం వాటాలతో ఏవీటీఈసీతో మరో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసేందుకు రెండో ఒప్పందం కుదుర్చుకుంది. దేశీ, విదేశ వాహన తయారీ సంస్థల అవసరాలకు అనుగుణంగా పవర్‌ట్రెయిన్స్‌ ఉత్పత్తి ఉండగలదని పీఎస్‌ఏ గ్రూప్‌ చైర్మన్‌ కార్లోస్‌ టవరెస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement