హెచ్‌ఐవీ, మధుమేహం ఔషధాల రేట్లు 44% దాకా తగ్గింపు | Prices of HIV, diabetes and angina drugs slashed by up to 44pc | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ, మధుమేహం ఔషధాల రేట్లు 44% దాకా తగ్గింపు

Dec 24 2016 12:32 AM | Updated on May 25 2018 2:41 PM

హెచ్‌ఐవీ, మధుమేహం ఔషధాల రేట్లు 44% దాకా తగ్గింపు - Sakshi

హెచ్‌ఐవీ, మధుమేహం ఔషధాల రేట్లు 44% దాకా తగ్గింపు

హెచ్‌ఐవీ, మధుమేహం మొదలైన వాటి చికిత్సలో ఉపయోగించే 50 పైగా ఔషధాల ధరలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది.

న్యూఢిల్లీ: హెచ్‌ఐవీ, మధుమేహం మొదలైన వాటి చికిత్సలో ఉపయోగించే 50 పైగా ఔషధాల ధరలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. దీంతో వీటి ధరలు 5 నుంచి 44 శాతం దాకా తగ్గనున్నాయి. 29 ఫార్ములేషన్ల రిటైల్‌ ధరలపై కూడా జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) పరిమితులు విధించింది. జాబితాలోని నిర్దిష్ట ఔషధాల ధరలు 5–44 శ్రేణిలో తగ్గుతాయని, తగ్గుదల సగటున 25 శాతం మేర ఉండగలదని ఎన్‌పీపీఏ చైర్మన్‌ భూపేంద్ర సింగ్‌ తెలిపారు.

తాజాగా నిర్దేశించిన పరిమితుల ప్రకారం హెచ్‌ఐవీ చికిత్సలో ఉపయోగించే నెవిరాపైన్‌ కాంబినేషన్‌ ఔషధ ట్యాబ్లెట్‌పై సీలింగ్‌ ధర రూ. 14.47గా ఉంటుంది. క్యాన్సర్‌ సంబంధ కీమోథెరపీలో ఉపయోగించే సైటోసిన్‌ అరాబినోసైడ్‌ ఒక్కో ప్యాక్‌ ధర (500 మి.గ్రా) రూ. 455.72గా ఉండనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement