
ప్రెసిషన్ కాంషాఫ్ట్స్ ఐపీవో నేటి నుంచి..
ప్రెసిషన్ కాంషాఫ్ట్స్ బుధవారం ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. కంపెనీ ఈ ఐపీవో ద్వారా మొత్తంగా దాదాపు రూ.410 కోట్ల నిధులను సమీకరించనున్నది.
ప్రైస్ బాండ్ రూ.180-రూ.186
న్యూఢిల్లీ: ప్రెసిషన్ కాంషాఫ్ట్స్ బుధవారం ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. కంపెనీ ఈ ఐపీవో ద్వారా మొత్తంగా దాదాపు రూ.410 కోట్ల నిధులను సమీకరించనున్నది. ఈ ఐపీవో జనవరి 29న ముగియనున్నది. ఐపీవో ప్రైస్ బాండ్ రూ.180-రూ.186గా నిర్ణయించారు. కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.10 ముఖవిలువ గల దాదాపు 91,50,000 ఈక్విటీ షేర్లను జారీ చే యనున్నది. అలాగే రూ.240 కోట్ల విలువైన షేర్లను తాజాగా ఇష్యూ చేయనున్నది.
కంపెనీ రూ.186 ధర వద్ద 66.16 లక్షల ఈక్విటీ షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు (ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ ట్రస్టీ కంపెనీ, బిర్లా సన్‌లైఫ్ ట్రస్టీ కంపెనీ, కెనరా రొబెకొ మ్యూచువల్ ఫండ్) కేటాయించడం ద్వారా రూ.123 కోట్లను సమీకరించింది.