బీమా ప్రీమియంచెల్లింపులకు తపాలా శాఖ కొత్త సాఫ్ట్వేర్... | Postal life insurance to make premiem online payment new software mekanish | Sakshi
Sakshi News home page

బీమా ప్రీమియంచెల్లింపులకు తపాలా శాఖ కొత్త సాఫ్ట్వేర్...

Mar 3 2016 1:53 AM | Updated on Sep 18 2018 8:18 PM

తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా ప్రీమియంలను ఆన్‌లైన్‌లో చెల్లించే విధంగా తపాలా శాఖ మెకానిష్ అనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందిం చింది.

సాక్షి, విజయవాడ బ్యూరో: తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా ప్రీమియంలను ఆన్‌లైన్‌లో చెల్లించే విధంగా తపాలా శాఖ మెకానిష్ అనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందిం చింది. దశల వారీగా దీన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. కాగా పాలసీదారులు తమకు దగ్గరలో ఉన్న తపాలా శాఖ ప్రధాన కార్యాలయాలకు వెళ్లి ప్రీమియం పాస్ పుస్తకాలనుగానీ, వాటి నకలు కాపీలను గానీ అందజేసి ప్రీమియం చెల్లింపులను క్రమబద్ధీకరించుకోవాలనీ, ఈ నెల 15 లోగా ఈ చెల్లింపులను పూర్తి చేసుకోవాలని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల తపాలా శాఖ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం  ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement