ఫైజర్ లాభం 57 శాతం అప్ | Pfizer posts Rs67 crore net profit in Q4 | Sakshi
Sakshi News home page

ఫైజర్ లాభం 57 శాతం అప్

May 7 2016 1:22 AM | Updated on Sep 3 2017 11:32 PM

ఫైజర్ లాభం 57 శాతం అప్

ఫైజర్ లాభం 57 శాతం అప్

ఫైజర్ కంపెనీ నికర లాభం(స్టాండోలోన్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 57 శాతం పెరిగింది.

ఒక్కో షేర్‌కు రూ.15 డివిడెండ్
న్యూఢిల్లీ: ఫైజర్ కంపెనీ నికర లాభం(స్టాండోలోన్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 57 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో రూ.43 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2015-16) క్యూ4లో రూ.67 కోట్లకు పెరిగిందని ఫైజర్ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.463 కోట్ల నుంచి రూ.515 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే 2014-15లో రూ.70 కోట్లుగా ఉన్న నికర లాభం 2015-16లో రూ.223 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.1,853 కోట్ల నుంచి రూ.2,017 కోట్లకు పెరిగాయని వివరించింది. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.15 డివిడెండ్‌ను ప్రకటించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఫైజర్ షేర్ 1.95 శాతం లాభంతో రూ.1,780 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement