 
															తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహన వినియోగ దారులకు శుభవార్త. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి.
	న్యూఢిల్లీ: వాహన వినియోగ దారులకు శుభవార్త. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధరను లీటర్కు 74 పైసలు చొప్పున తగ్గించారు. ఇక డీజిల్ ధర లీటర్పై రూ. 1.30 పైసలు తగ్గింది.  తగ్గించిన ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.
	
	కాగా ఇదే నెల 5న పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో పెట్రోలు లీటర్కు రూ. 2.19,  డీజిల్ 98 పైసలు చొప్పున పెరిగింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
