మహిళలకు ఉచితంగా పారామెడికల్‌ విద్య

Paramedical education to women for free - Sakshi

ముందుకొచ్చిన అపోలో మ్యునిక్‌ హెల్త్‌

న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా రంగంలోని అపోలో మ్యునిక్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌... మహిళా సాధికారతకు ముందుకొచ్చింది. అపోలో మెడ్‌స్కిల్స్‌ లిమిటెడ్‌తో కలసి ఆర్థికంగా, సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన 10వేల మంది మహిళలకు రోష్ని కార్యక్రమం కింద పారామెడికల్‌ విద్యను ఉచితం గా అందించనున్నట్టు ప్రకటించింది.

తగిన శిక్షణ పొందిన పారామెడికల్‌ నిపుణుల కొరతను ఇది కొంత వరకు తీరుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘గడిచిన పదేళ్లలో మా ఇన్నోవేటివ్‌ ఉత్పత్తులు, సేవల ద్వారా 3 కోట్ల మందికి చేరువయ్యాం. ఏ గందరగోళం లేని ఉత్పత్తులతో ఆరోగ్య, దృఢమైన భారత్‌ను సాకారం చేయాలన్న లక్ష్యంలో ముందుకెళ్లాం’’ అని అపోలో మ్యునిక్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సీఈవో ఆంటోనీ జాకబ్‌ చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top